14-08-2025 06:29:02 PM
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ పరిధి పైడిపల్లి శివారులో 6 బ్లాకులకు 70 రెండు పడక గదుల భవన సముదాయాన్ని గురువారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు(MLA KR Nagaraju) పరిశీలించారు. ఈ సందర్భంగా రెండు పడక గదులలో ఆర్ అండ్ బి శాఖచే చేపడుతున్న మరమ్మతులు, ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు, ఎలక్ట్రికల్ పనులను పరిశీలించారు. వేగవంతంగా పనులను పూర్తి చేసి దివ్యంగ లబ్ధిదారులకు అందించుటకు సిద్ధం చేయాలనీ అన్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో నిర్మించిన అంతర్గత రోడ్డును ఎమ్మెల్యే నాగరాజు పరిశీలించి, ప్రాంగణంలో పలు రకాల మొక్కలను నాటి గ్రినరిని పెంచుటకు మున్సిపల్ ఉద్యనవనాల అధికారులకు పలు సూచనలు చేశారు. పక్కన ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి, స్థానిక కార్పొరేటర్ జన్ను శీభరాణి అనిల్ కుమార్, అధికారులు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.