14-08-2025 06:26:58 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ గా అభివృద్ధి చేసిన ఐటిఐ ద్వారా విద్యార్థులకు నూతన కోర్సులతో ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని లేబర్ అధికారి రాజేంద్రప్రసాద్ తెలిపారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్, ఆడిష్టం యూజింగ్ అడ్వాన్స్ టూల్, బేసిక్ డిజైనర్ వర్చువల్ వెరిఫై (మెకానికల్), అడ్వాన్స్ సిఎన్ సి మిషినింగ్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) తదితర కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
ఆసక్తి గల విద్యార్థులు https://www.iti.telangana.gov.in వెబ్ సైట్ లో సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి దరఖాస్తు చేసుకోవాలని, అలాగే హార్డ్ కాపీలతో ఐటిఐ కళాశాలలో సంప్రదించాలని సూచించారు. ఈ మేరకు ప్రచార పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐటిఐ ప్రిన్సిపల్ బాబు, నరేష్, జిల్లా ఉపాధి అధికారి రజిత, శిక్షణ అధికారి ఉప్పలయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.