24-01-2026 12:00:00 AM
అవగాహన కల్పించిన మేడిపల్లి పోలీసులు
మేడిపల్లి, జనవరి 23 (విజయక్రాంతి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా అరైవ్ ఆలైవ్ నినాదంతో జనవరి 13 నుంచి 27 వరకు రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు భద్రతపై విస్తృ త అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమాల్లో భాగంగా, శుక్ర వారం 8వ రోజు ఉప్పల్ డిపో ఆపోజిట్ లోని ది వ్యూ ఫంక్షన్ హాల్ లో సుమారు 100 మందితో ఇండస్ట్రియల్ మరియు ట్రాన్స్పోర్ట్ సెక్టార్ రోడ్ సేఫ్టీ పైన ఎస్‌ఐలు వీరబాబు, శివకుమార్ ఆధ్వర్యంలో వాహనాల ఓనర్లకు డ్రైవర్లకు అవగాహన కల్పిం చారు. ఈ కార్యక్రమంలో ఇసుక అడ్డ లారీల ఓనర్స్, డ్రైవర్స్, సిద్ధార్థ, పల్లవి, మెరీడియన్ స్కూల్ డ్రైవర్స్, తదితరులు పాల్గొన్నారు.