calender_icon.png 24 January, 2026 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగుల సంక్షేమం కోసం అవగాహన

24-01-2026 12:00:00 AM

కామారెడ్డి అర్బన్, జనవరి 23 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కామారెడ్డి ఆధ్వర్యంలో బీడి వరక్స్ ప్రైవేట్ లిమిటెడ్, కామారెడ్డి కార్యాలయంలో కార్మికుల కోసం శుక్రవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం  నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  టి. నాగరాణి, డీఎల్‌ఎస్‌ఎ సెక్రటరీ, కామారెడ్డి  హాజరై, పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగుల హక్కులు, శ్రేయస్సు, భద్రతా మరియు ఆరోగ్య పరిరక్షణపై ముఖ్యమైన సూచనలు అందించారు.

ఉద్యోగుల సంక్షేమం కోసం అవగాహన కార్యక్ర మాల ప్రాముఖ్యతను, సరైన నియమావళి పాటించడం ఎంత ముఖ్యమో వివరించారు. ఎంప్లొయ్యెస్  (సేఫ్టీ అండ్ వెల్ఫేర్) చట్టం, కార్మికులకు కనీస జీతం, సమయానికి జీత చెల్లింపు, పని సమయంలో గాయమైతే, నష్టపరిహారం,  ఉద్యోగుల యూనియన్ హక్కు ల చట్టాల గురించి, అలాగే, ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాల ప్రాముఖ్యత,మరియు పని చేసే పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలను వివరించారు.

ఖమ్రుద్దీన్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, నవ తెలంగాణ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు  ఖాజా మోయినుద్దీన్, నవ తెలంగాణ యూనియన్  సెక్రటరీ మరియు బీడి కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. రాజు, డీఎల్‌ఎస్‌ఎ జూనియర్ అసిస్టెంట్ ఖాజా సమీ ఉల్లాహ్‌ఖాన్  & స్టాఫ్  మరియు ఇతరలు హాజరైనారు.