calender_icon.png 7 August, 2025 | 6:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాలపై అవగాహన

07-08-2025 12:22:29 AM

సిద్దిపేట క్రైమ్, ఆగస్టు 6 : సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సిద్దిపేట సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. బుధవారం సైబర్ జాగ్రూక్త దివాస్ సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల కళాశాల  విద్యార్థులకు ఫెడెక్స్ కొరియర్స్ క్యాంప్, ఐపీఎల్, ఆన్లైన్ బెట్టింగ్ స్కాం, డిజిటల్ అరెస్టు, లోన్ యాప్స్ తదితర సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు.

కళాబృందం సభ్యులు, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కలసి నాటకం రూపంలో వివరించారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే 1930 నెంబర్ కు ఫోన్ చేయాలని,  NCRP portal (www.cybercrime.gov.in)లో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ వారు తక్షణమే స్పందిస్తారని తెలిపారు. తద్వారా పోయిన డబ్బులు రికవరీ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.