calender_icon.png 7 August, 2025 | 8:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తహసిల్దార్ మృతిని శవరాజకీయంగా మార్చడం సిగ్గుచేటు

07-08-2025 05:57:01 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): ఇటీవల గుండెపోటుతో మరణించిన తహసీల్దార్ జ్యోతి సంఘటనను శవరాజకీయంగా మార్చడం సిగ్గుచేటని నెన్నెల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గట్టు మల్లేష్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొంతమంది బిఆర్ఎస్ నాయకులు విషాద సంఘటనను రాజకీయ లబ్ధికి వాడుకుంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం దురదృష్టకరమన్నారు. గత ప్రభుత్వ హయాంలో అధికారులపై నాయకులు అనేక బేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.

అప్పటి తాసిల్దార్ సత్యనారాయణపై ఒత్తిడి చేసి తప్పుడు కుల దృవీకరణ పత్రం ఆధారంగా రంగురామా గౌడ్ పై అట్రాసిటీ కేసు పెట్టారని దీంతో ఆయన కలెక్టర్ కార్యాలయంలో పురుగుల మందు తాగి మృతి చెందారని గుర్తు చేశారు. గతంలో తహసిల్దార్ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిపై ఒత్తిడి తీసుకువచ్చి తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు సృష్టించి అధికారులపై కేసులు కావడానికి కారణమయ్యారని ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక శవరాజకీయాలకు దిగుతున్నారని ఆరోపించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ ప్రజల మనిషని, ఎక్కడ భూకబ్జాలకు తావు ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ నాయకుల పై తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.