calender_icon.png 7 August, 2025 | 6:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శేరిలింగంపల్లిలో అక్రమ నిర్మాణాలు

07-08-2025 12:23:31 AM

  1. అడిగింది ఇచ్చుకో అంతస్థులు వేసుకో 
  2. భరితెగిస్తున్న బిల్డర్లు గ్రేటర్ ఆధాయానికి గండి 
  3. ప్రలోబాలకు రాజకీయ ఒత్తిళ్లకు లొంగుతున్న అధికారులు 

శేరిలింగంపల్లి, ఆగస్ట్ 6:దేశంలోనే అ త్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. అలాంటి నగరం బౌగోలికంగా విలాసవంతమైన, సుఖవనంతమైన జీవితం గడపడానికి ప్రజలు ఇష్టపడ తారు. దానికి తోడు సాఫ్ట్ వేర్, విద్యాలయా లు, ఆసుపత్రులు, వ్యాపార కేంద్రాలు, షా పింగ్ మాల్స్ ఇలా ఎన్నో సంస్థలు ఇక్కడ స్థి రపడ్డాయి. దాంతో నివాస గృహలకు ఫుల్ డిమాండ్ ఉంది.

ముఖ్యంగా వెస్ట్ జోన్ శేరిలింగంపల్లి జోన్ పరిధిలో హాస్టల్స్, హో టళ్ళు, సాఫ్ట్ వేర్ సంస్థలు ఉన్నాయి. వీటిలో పని చేసే ఉద్యోగులు, వర్కర్లు ఎక్కువగా నివసిస్తుంటారు. వీరికి సరిపడా నివాస ప్రాం తాలు లేకపోవడంతో బిల్డర్లు నిబంధనలు తుంగలో తొక్కి తమ ఇష్టాను సారంగా ని ర్మాణాలు చేసుకుంటా పోతున్నారు. నిజానికి ఒక నిర్మాణం చేపట్టాలంటే కొన్ని నియ మ నిబంధనలున్నాయి.

కానీ అక్రమ నిర్మాణాదారులు అవేమి పట్టించుకోరు. అద్దెలకు ఆశ పడి స్థల విస్తీర్ణంతో సంబందo లేకుం డా ఇష్టాను సారంగా స్థాయికి మించి అంతస్థులకు అంతస్థులు లేపుతున్నారు. వీటికి అ నుమతులు తీసుకోవాలి అంటే జి ప్లస్ 2,3 అయితే కిందిస్తాయి అధికారులే ఇస్తారు. ఇంకా ఎక్కువ స్థల విస్తీర్ణం ఉండి జి ప్లస్ 4, 5 ఆ పైన నిర్మించాలంటే జోనల్ స్థాయి, హె చ్.ఎం.డి.ఎ అధికారులు ఇవ్వాలి.

కానీ ఫై స్థా యి అధికారులు వద్దకు వెళ్లాలంటే అనుమతులకు డబ్బులు చెల్లించాలి, నియమనిబం ధనలు పాటించాలి, గ్రేటర్ పరిధిలో ఆది సా ధ్యం కాదు. కాబట్టి జి ప్లస్ 2 అనుమతులు తీసుకొని అధికారులకు ముడుపులు ముట్టజేప్పి, లేదంటే రాజకీయ నాయకుల చేత ఒ త్తిడి తెప్పించి తమ నిర్మాణాలను కొనసాగిస్తున్నారు.

అడ్డు అదుపే లేదు

నివాస గృహాలు అవసరమే కానీ వాటికీ కొన్ని పరిమిత్తులుంటాయి. కానీ అక్రమార్కులకు అవేమి పట్టవు, అధికారులకు ము డుపులు ముట్టజేప్పి ఇష్టాను సారంగా నిర్మాణాలు చేపడుతున్నారు. శేరిలింగంపల్లి జంట సర్కిల్లలోని, శేరిలింగంపల్లి,మాదాపూర్ కొం డాపూర్, చందానగర్, మియాపూర్ డివిజ న్లో వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న బడా బిల్డర్లు తమ ఇష్టాను సారంగా అనుమతులకు మించి, సెట్ బ్యా క్స్ లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు.

ఇ వే కట్టడాలు రేపు ప్రమాదాలకు కారకాలు కాదా? కనీస మౌలిక సదుపాయాలు లేకుం డా కడుతున్న అపార్ట్మెంట్లు భవిష్యత్తులో శా పంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతటి అక్రమాలు జరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? జీహెచ్‌ఎంసి అధికారులపై విచారణ జరుగుతుందా? లేక ఇదే పాలనా తీరా?‘పొయ్యిలో చట్టం వేసుకుంటే&రేపు మంటలు ప్రజల ఇళ్లకే వస్తాయి అనేంతగా ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది.

జోనల్,డిప్యూటీలకు కనపడటం లేదు?

స్థానిక అధికారుల తీరుపై ఇంత విమర్శ లు వెల్లువెత్తుతున్నా, జోనల్ కమిషనర్, డి ప్యూటీ కమిషనర్లు స్పందించకపోవడం దేని కి సంకేతం చట్టాన్ని ఆచరణలో పెట్టాల్సిన అధికారులు గాలికి వదిలేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.అధికారులు చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజల అనుమానాలను ని వృత్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.