calender_icon.png 9 January, 2026 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిషన్ వాత్సల్యపై అవగాహన

07-01-2026 12:03:10 AM

శ్రీరంగాపురం జనవరి 6: మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం నాడు మిషన్ వాత్సల్య పై సర్పంచ్ మద్దిలేటి ఆధ్వర్యంలో గ్రామస్తులకు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్మించారు. సందర్భంగా  సర్పంచ్ మద్దిలేటి మాట్లాడుతూ  బాలికలకు బాల్య వివాహాల నిర్మూలలపై అమ్మాయిల తల్లిదండ్రులకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

అమ్మాయిలకు 20 సంవత్సరాలు వరకు చక్కగా చదివించి వివాహం చేయాలని అన్నారు. సమాజంలో బాలికల ఎదుగుదలకు ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించాలని అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఖాజా, పంచాయతీ కార్యదర్శి సహదేవ్, అంగన్వాడి టీచర్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.