07-01-2026 12:04:33 AM
ఆకస్మిక తనిఖీ చేసిన సర్పంచ్ స్వప్న
గోపాలపేట, జనవరి 6: విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించి వారు ఆరోగ్యంగా ఉండేలా చూడాలని సర్పంచ్ స్వప్న భాస్కర్ అన్నారు. మంగళవారం గోపాలపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాల గదులను పరిశీలించారు. అనంతరం వంటశాలను తనిఖీ చేసి ఉంటా మహిళలతో మాట్లాడారు. ప్రతిరోజు మెనూ ప్రకారం వంటకాలు చేస్తున్నారా లేదా అని ఉంట మహిళలను హారతిశారు.
విద్యార్థులకు వేడివేడి మంచి భోజనాన్ని అందించాలని తెలిపారు. ప్రభుత్వం కూడా పాఠశాలలకు సరైన పౌష్టికాహారం అందించేందుకు కృషి చేయాలని తెలిపారు. అనంతరం పాఠశాల యాజమాన్యంతో మాట్లాడుతూ ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని వారికి సూచించారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.