calender_icon.png 17 January, 2026 | 11:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు భద్రతపై అవగాహన

17-01-2026 03:43:51 AM

పాల్గొన్న ఏసీపీ చక్రపాణి

మేడిపల్లి,జనవరి 16 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము యొక్క రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగముగా శుక్రవారం బోడుప్పల్ సర్కిల్ లో ‘ఏరైవ్ ఏలైవ్‘ అనే నినాదముతో 10 రోజుల పాటు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిం ది.

ఈ కార్యక్రమంలో భాగముగా రెండవ రోజు ప్రభుత్వ కార్యాలయ ఉద్యోగులకు, సిబ్బందికి మునిసిపల్ ఉద్యోగులకు ఏసీపీ ఎన్.చక్రపాణి,మేడిపల్లి సీఐ గోవింద రెడ్డి అవగాహన కల్పించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో అసిస్టెంట్ మునిసిపల్ కమీషనర్ ఇ.శ్యామ్ సుందర్ రావు,డిఇఇ సాయినాథ్ గౌడ్, డిఇఇ (ఎస్.డబ్లు.ఎమ్) కె. జాహ్నవి శశాంక్, సర్కిల్ సూపరిండెంట్ క్రాంతి, వార్డ్ ఆఫీసర్స్, వార్డ్ సూపర్ వైసర్స్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.