calender_icon.png 17 January, 2026 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు & ఫోన్ ట్యాపింగ్ కేసు

17-01-2026 02:36:44 AM

ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు ఇది చివరి అవకాశం

  1. ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం 
  2. అసెంబ్లీ స్పీకర్‌పై సుప్రీం కోర్టు సీరియస్ 
  3. ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హతపై రెండు వారాల గడువు 
  4. అప్పటికీ నిర్ణయం తీసుకోకపోతే మేమే నిర్ణయం తీసుకుంటాం!

న్యూఢిల్లీ, జనవరి 16 : తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు, వారి అనర్హత కేసుపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది.  ఎమ్మెల్యేల ఫి రాయింపు కేసులో స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వా రాల్లోగా తేల్చకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించింది. ఏడుగురు ఎ మ్మెల్యేల పిటిషన్లపై చర్యలు తీసుకున్నా, మిగతా వారిపై ఇంకా నిర్ణయం రాకపోవడంతో కోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ఇది చివరి అవకాశమని  స్పష్టంచేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ మసీహ్ ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది. స్పీకర్ తీసుకున్న చర్యలపై ఆయన తరఫు అడ్వొ కేట్ అభిషేక్ సింఘ్వీ నివేదిక అందించారు.

ఇప్పటివరకు ఏడుగురు ఎమ్మెల్యేలపై విచారణ జరిపి.. తీర్పు వెలువరించార ని పేర్కొ న్నారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల అమలులో స్పీకర్ విఫలమయ్యారని బీఆర్‌ఎస్ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరా యింపుల వ్యవహారంలో ఇప్పటివరకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం తో సుప్రీం కోర్టు ధర్మాసనం సీరియస్ అయింది. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని ఇది చివరి అవకాశం అని అల్టిమేటం జారీచేసింది.

ఇకపైన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఈ వ్యవహారంలో నిర్ణయం తీసుకోకపోతే తీవ్రంగా వ్యవహరించాల్సి వస్తుందని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం, మరో ముగ్గురు ఎమ్మెల్యేల పైన ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంపైన ఆగ్రహం వ్యక్తంచేసింది. 

 ఇదిలాఉంటే, వింటర్ వెకేషన్ తర్వాత తొలిసారిగా ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలలో ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వారిపైన దాఖలు చేసిన అనర్హత పిటిషన్లు కొట్టివేశారు. ఈ నెల 15న పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య ఫిరాయింపులపైన ఇచ్చిన అనర్హత పిటిషన్లను స్పీకర్ తిరస్కరించారు. వారు పార్టీ మారినట్టు ఎటువంటి ఆధారాలు లేవని, ఆ ఇద్దరు ఇంకా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నట్లు ఆయన స్పష్టంచేశారు. ఈ కేసును గత ఏడాది నవంబర్‌లో విచారణ మొదలుపెట్టిన సుప్రీం ధర్మాసనం, స్పీకర్ దీనిపైన నిర్ణయం తీసుకోవడానికి నాలుగు వారాల గడువును ఇచ్చింది.

అయితే స్పీకర్ తరపు న్యాయవాది తాజాగా..  మిగతా ముగ్గురు ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసేందుకు 4 వారాల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. స్పీకర్ రెండు వారాల్లోగా ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశిం చింది. అందులో పెండింగ్ ఉన్న కేసుల పరిష్కారానికి తీసుకున్న చర్యలు, పురోగతిని వివరించాలని సూచించింది. రెండు వారాల తర్వాత తదుపరి విచారణ జరగనుంది. మిగిలిన కేసుల్లో స్పష్టమైన పురోగతి కనిపిస్తే, అదనపు సమయం గురించి తర్వాత ఆలోచిస్తామని సుప్రీంకోర్టు బదులిచ్చింది.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో.. దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్‌పై వచ్చిన అనర్హత పిటిషన్లపై ఇంకా నిర్ణయం వెలువడలేదు. ఇతర కేసుల్లో, పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేకపోవడంతో స్పీకర్ వారి పిటిషన్లను కొట్టివేశారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయాలలోని లోపాలను ఈ దశలో తాము పరిశీలించలేమని కోర్టు స్పష్టంచేసింది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే, ప్రత్యేక న్యాయ ప్రక్రియల ద్వారా లేవనెత్తాలని సూచించింది.

ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రభాకర్‌రావుకు ఊరట

  1.  ఇంకా అదనపు విచారణ ఎందుకు? 
  2. రెండు వారాలు కస్టడీకి అనుమతించాం 
  3. ముందస్తు బెయిల్ ఇచ్చినా విచారణకు పిలవొచ్చు కదా: సుప్రీం కోర్టు
  4. పోలీసుల తీరుపై జస్టిస్ నాగరత్న ధర్మాసనం ప్రశ్నలు

న్యూఢిల్లీ, జనవరి 16: తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యా పింగ్  కేసులో ఎస్‌ఐబీ  మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయ వాదులపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావు తన ఐ క్లౌడ్ పాస్వర్డ్ రీసెట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభాకర్‌రావుకు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ పొడిగించింది. రీసెట్ చేసిన తర్వాత డేటా డిలీట్ చేశారని తేలితే కేసు డిస్మిస్ చేస్తామని జస్టిస్ మహదేవన్ హెచ్చరించారు. ఈ కేసులో తదుపరి విచారణను మార్చి 10కి వాయిదావేసింది.

ఈ కేసుపై జస్టిస్ బీవీ నాగరత్నం, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున  సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తునకు ప్రభాకర్‌రావు సహకరించడం లేదని, ఆయన్ను కస్టోడియల్ ఇంటరాగేషన్‌కు అప్పగించాలన్నారు. ఇప్పటికే రెండు వారాల కస్టడీకి అనుమతి ఇచ్చామని గుర్తు చేసిన ధర్మాసనం.. ఇంకెంతకా లం విచారణ కొనసాగిస్తారు? ఈ కేసులో ఇంకా ఏం మిగిలింది? అంటూ దర్యాప్తు సంస్థను ప్రశ్నించింది. ప్రభాకర్‌రావు ఇంటరాగేషన్‌ను పూర్తిచేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు.. మీ పర్పస్ పూర్తయిందా? లేదా? మళ్లీ ఆయన్ని జైల్లో పెట్టాలనుకుంటున్నారా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది.

ముందస్తు బెయిల్ ఇచ్చినంత మాత్రాన ప్ర భాకర్‌రావును పిలవకుండా ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అవసరమైతే మళ్లీ పిలిచి విచారణ చేయవచ్చనని పేర్కొంది. కేసు దర్యాప్తును దృష్టిలో ఉంచుకొని ఆర్టికల్ 142 కింద మధ్యంతర ఉత్తర్వు లు జారీ చేసినట్లు ధర్మాసనం వెల్లడించింది. తదుపరి విచారణ వరకు ప్రభాకర్‌రా వు టకు ఇచ్చిన మధ్యంతర రక్షణను పొడిగిస్తున్నట్లు తెలిపింది. అయితే, తెలంగాణ ప్ర భుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. ప్రభాకర్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణ అర్హత ఉందా, లేదా అనేదే ప్రధాన ప్రశ్నగా పేర్కొన్నారు. అలాగే, కస్టడీలో ఉన్న వ్యక్తికి ముందస్తు బెయిల్ ఎలా ఇస్తారని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఆయనకు ముందస్తు బెయిలు ఇస్తే న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని పేర్కొన్నారు. క స్టోడియల్ ఇంటరాగేషన్ ద్వారానే నిజాలు బయటికి వస్తాయని లూథ్రా తెలిపారు. ‘ఐ ఫోన్, ఐక్లౌడ్ పాస్వర్డ్ ఇవ్వడం లేదు. ప్రభు త్వం మారగానే హార్డ్ డిస్క్‌లో డేటా ధ్వంసంచేశారు. కొత్తగా 50 హార్డ్ డిస్కులు అక్కడ పెట్టారు. రాజకీయనేతలు, జర్నలిస్టులు, జడ్జిలు, బిల్డర్లు, వ్యాపారుల ఫోన్లు టాప్ చేశారు. నక్సలైట్ల పేరుతో ఈ కార్యక్రమాలన్నీ చేశారు. డేటా మొత్తం డిలీట్ చేసి డివై సెస్ మాకు ఇచ్చారు’ అని కోర్టుకు లూథ్రా తెలిపారు. ఈ కేసులో తాజాగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా, న్యాయపరంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దర్యాప్తు వేగం, కస్టడీ అవసరం, ముందస్తు బెయిల్ అంశాలపై కోర్టు స్పష్టత ఇవ్వడం ఈ కేసులో కీలక మలుపుగా భావిస్తున్నారు.