calender_icon.png 17 January, 2026 | 6:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరల్డ్ కప్‌కు జడేజా కష్టమే

17-01-2026 04:23:16 AM

  1. పేలవ ఫామ్‌లో ఆల్ రౌండర్ 

అక్షర్ పటేల్ నుంచి గట్టి పోటీ 

రిటైర్మెంట్ ఇవ్వడమే మిగిలిందా ?

భారత్ క్రికెట్‌లో మరో శకం ముగియబోతోంది. దశాబ్ద కాలంగా అద్భుతమైన ఆల్ రౌండర్‌గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా రిటైర్మెంట్ కు దగ్గర పడినట్టే కనిపిస్తోంది. 2027 వన్డే ప్రపంచ కప్ వరకూ కొనసాగే అవకాశం ఉందని అనుకున్నా జడేజా ప్రస్తు త ఫామ్ చూస్తే కష్టమే అని భావిస్తున్నారు.  2024 టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బాటలోనే పొట్టి ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పేశాడు. తర్వాత వారిద్దరూ టెస్టుల నుంచి కూడా తప్పుకున్నా జడ్డూ మాత్రం టెస్ట్, వన్డే రెండు ఫార్మాట్లలో కొనసాగుతున్నాడు.

అయితే మునుపటి తరహాలో మాత్రం ప్రదర్శన లేదు. మ్యాచ్ ను మలుపు తిప్పే ప్రదర్శనలు అస్సలు లేవు. గత రెండేళ్లుగా గణాంకాలు చూస్తుంటే జడే జా కెరీర్ ముగింపు దశకు చేరుకుందనే అనిపిస్తోంది.2023 వరల్డ్ కప్ ఏడాదిలో 26 మ్యాచ్‌లు ఆడి 31 వికెట్లు తీసిన జడేజా ఆ తర్వాత పూర్తిగా వెనుకబడిపోయాడు. 20 25, 2026 సీజన్లలో 13 వన్డేలు మాత్రమే 12 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. బ్యాట్ తోనూ పెద్దగా ఆకట్టుకోలేదు.

కేవలం 139 రన్స్ మాత్రమే చేశాడు. సుదీర్ఘ వన్డేల అనుభవం ఉన్న ఆటగాడికి ఇది చాలాదారు ణమైన ప్రదర్శనే. బంతితో జడేజా మునుప టి మ్యాజిక్ చూపలేక పోతున్నాడు. పైగా జ ట్టులో యువ ఆటగాళ్ల నుంచి పోటీ పెరిగిం ది. ప్రస్తుతం జడేజా స్థానానికి అక్షర్ పటేల్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. గతేడాది అక్షర్ 11 వన్డేల్లోనే 290 పరుగులు చేయడ మే కాకుండా 11 వికెట్లు తీసి తన సత్తా చా టాడు. 

ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ జట్టులో ఉన్న కారణంగా అక్షర్ అందుబాటులో లేకపోయినా, జూన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్ నాటికి అతను జట్టులోకి రావడం ఖాయం. అప్పుడు జడేజా తన స్థానాన్ని కా పాడుకోవడం కష్టమే. అలాగే బ్యా టింగ్ లోనూ ఫినిషర్ రోల్ కూడా జడ్డూ పోషించలేక పోతున్నాడు. అదే సమయంలో జడేజా ను 5వ లేదా 6వ నంబర్లో ఆడించాలనే ప్రయోగం టీమిండియాకు ఏమాత్రం కలిసిరావడం లేదు.

5వ నంబర్లో ఆడిన 3 మ్యా చ్ల్లో కేవలం 30 పరుగులే చేశాడు. ప్రస్తుతం యువ ఆటగాళ్ల రాకతో జడేజా తన 7వ స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోతున్నా డు.రానున్నమ్యాచ్ల్లో ఆల్ రౌం డర్‌గా అసాధారణ ప్రదర్శన చేస్తే తప్ప, 20 27 వన్డే వరల్ కప్ రేసులో జడేజా నిలవడం కష్టమేనని పలువురు అంచనా వేస్తున్నారు. యువ ఆటగాళ్ల పోటీ తట్టుకుని జడేజా ము నుపటి మ్యాజిక్ చూపించడం అంత సులభం కాదు.