17-01-2026 03:45:24 AM
శేరిలింగంపల్లి, జనవరి 16 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాలు కేవలం సం ఖ్యలు కావని, అవి ఎన్నో కుటుంబాల కన్నీళ్లని గుర్తు చేస్తూ ‘అరైవ్ అలైవ్’ రోడ్ సేఫ్టీ ప్రచారం కొండాపూర్ ఆర్టీఓ కార్యాలయంలో జరిగింది. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) డాక్టర్ గజరావు భూపాల్, ఐపీఎస్ పాల్గొని ప్రజలను చైతన్యపరిచారు.
మీరు ఇంటికి క్షేమంగా చేరితేనే సమా జం సురక్షితంగా ఉంటుందన్నదే అరైవ్ అలైవ్ సారమని ఆయన పేర్కొన్నారు. అనంతరం గచ్చిబౌలి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సురేష్ రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్, ఆర్టీఓ సిబ్బంది, డ్రైవింగ్ లైసెన్స్ అభ్యర్థులు కలిపి సుమారు 200 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.