31-10-2025 11:09:14 PM
ఆర్మూర్,(విజయక్రాంతి): పట్టణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క, తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి సహకారంతో పట్టణానికి టీయూఎఫ్ఐడీసీ నిధుల కింద సుమారు 47 కోట్లు, యుఐడిఎఫ్ కింద 18 కోట్ల 70 లక్షలు, మినీ ట్యాంక్ బండ్ నిర్మాణానికి 4 కోట్ల రూపాయలు నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది.
ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేసిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి.ఈ నిధులలో భాగంగా ఆర్మూర్ పట్టణ పరిధిలోని 7వ వార్డులలో మోడల్ స్కూల్ కేజీబీవీ స్కూల్ ,మైనారిటీ స్కూల్ మరియు తిరుమల కాలనీ లలో తిరిగి స్థానిక సమస్యలు రోడ్లను,డ్రైనేజీలను నిర్మించడానికి కాలనీవాసులతో తిరగడం జరిగింది.