calender_icon.png 6 December, 2025 | 1:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచ ఎయిడ్స్ మహమ్మారిపై అవగాహన

06-12-2025 12:00:00 AM

మేడ్చల్ అర్బన్ డిసెంబర్ 5 (విజయక్రాంతి):ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని ఘనపూర్ మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎంఐఎంఎస్)లో  ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాలు  నిర్వహించారు. మెడికల్ కళాశాలలో  ఎంబీబీఎస్  విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.విద్యార్థులు ఎయిడ్స్‌కు సంబంధించిన పలు విషయాలను వివరిస్తూ తీర్చిదిద్దిన రంగవల్లులు అందర్నీ  ఆకట్టుకున్నాయి.

దీనితో పాటు పీజీ విద్యార్థులు ఎయిడ్స్ కు సంబంధించిన పలు సాంకేతిక అంశాలు,చికిత్స తీసుకోవాల్సిన జాగ్రత్తల వంటి వాటిపై తయారు చేసిన వాల్ పోస్టర్  ప్రదర్శించారు. అనంతరం మెడికల్ కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎంఐఎంఎస్ కు చెందిన గైనకాలజీ విద్యార్థులు గర్భధారణ ధరించిన మహిళలకు ఎయిడ్స్ సోకినట్లు తేలితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తూ ప్రత్యేకమైన (స్కిట్) నాటిక ప్రదర్శించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళలకు రోగి కుటుంబ సభ్యులకు ప్రత్యేక అవగాహన  కల్పించారు.

ఈ కార్యక్రమాన్ని గైనకాలజీ విభాగపు హెచ్‌ఓడి డాక్టర్ కల్పనా నేతృత్వంలో గైనకాలజీ పీజీ విద్యార్థులు నిర్వహించి అందరిని ఆకట్టుకున్నారు. అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంఐఎంఎస్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగం వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో స్థానిక వైద్యులతో కలిసి అక్కడి రోగులకు ఎయిడ్స్ మహమ్మారిపై కరపత్రాల పంపిణీతో పాటు ఉపన్యాసాల తో అవగాహన కల్పించడం జరిగిందని ప్రిన్సిపాల్ డాక్టర్ దేవేంద్ర సింగ్ నేగి చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎంఐఎంఎస్ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శైలేంద్ర, కళాశాల డైరెక్టర్ గీత.హెచ్‌ఓడి డాక్టర్ లియో ఎస్ వాజ్.డాక్టర్ హేమలత అసోసియేట్ ప్రొఫెసర్, .అల్వాల్ పీ.హెచ్.సి చెందిన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్.ఆయుష్ వైద్యులు డాక్టర్ శైలజ తో పాటు డాక్టర్ సరిత, స్వప్న, గైనకాలజీ విభాగాలకు చెందిన పీజీ విద్యార్థులు రోగులు వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.