calender_icon.png 1 May, 2025 | 3:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడీ కేంద్రంలో బాల్య వివాహాలపై అవగాహన

25-04-2025 08:31:33 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): కేసముద్రం మున్సిపాలిటీ పరిధి బ్రహ్మంగారి గుడి తండాలోని అంగన్ వాడీ కేంద్రంలో శుక్రవారం బాల్య వివాహాలు, పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఐసీపీఎస్ నరేష్ మాట్లాడుతూ... పోక్సో చట్టం, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి వివరించారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ ఆర్.విజయ మాట్లాడుతూ... యుక్త వయసుకు ముందే బాల్య వివాహాలు జరిగితే వచ్చే అనర్థాలను వివరించారు. ఈ కార్యక్రమంలో యుక్త వయస్సు బాలికలు, తల్లులు, అంగన్ వాడీ టీచర్స్ బి. జ్యోతి, ఈ.రాజమణి, జె.లలిత, ఆయా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.