calender_icon.png 31 January, 2026 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల మన్ననలను పొందుతున్న పత్రిక విజయక్రాంతి

31-01-2026 12:03:04 AM

విజయక్రాంతి క్యాలెండర్ ఆవిష్కరణ లో భద్రాద్రి పవర్ ప్లాంట్ సీఈ బిచ్చన్న 

మణుగూరు, జనవరి 30 (విజయక్రాంతి) : ప్రజా సమస్యలపై నిక్కచ్చిగా వార్తలు రాస్తూ అనతి కాలంలోనే  అన్ని వర్గాల   ప్రజల మన్ననలను పొందుతున్న  పత్రిక విజయక్రాంతి అని, భద్రాద్రి పవర్ ప్లాంట్ సీఈ బిచ్చన్న అన్నారు. విజయక్రాంతి  దినపత్రిక 2026 నూతన సంవత్సరం క్యాలెండర్ ను శుక్రవారం  తన కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం చీప్ ఇంజనీర్ బిచ్చన్న   మాట్లాడుతూ, విజయక్రాంతి దినపత్రిక నిజాలను నిర్భయంగా రాస్తూ,అనతి కాలంలోనే పాఠకుల అభిమానాన్ని చూరగొందన్నారు. పత్రిక రంగంలో రోజు రోజుకు పెరుగుతున్న పోటి ప్రపంచంలో  విజయక్రాంతి పత్రిక తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుందని తెలిపారు.

ప్రతి అక్షరం ప్రజల పక్షంగా విజయక్రాంతి దినపత్రిక విజయవంతంగా ప్రజల గొంతుక వినిపి స్తోందని, విలువలతో కూడిన వార్తలతో సమాజానికి దిశా నిర్దేశం చేస్తోందన్నారు. విజయక్రాంతి క్యాలెండర్ లో వేసిన సీనరీ లు, డిజైన్లు చాలా చక్కగా ఉంటాయని తెలంగాణ సాంస్కృతికి ప్రతిబింబంగా నిలిచాయని ప్రశంసించారు. 2026 నూత న క్యాలెండర్ ఎంతో ఆకర్షణీయంగా, అద్భుతంగా రూపొందిందన్నారు. ప్రజల లో అవగాహన కల్పించడంలో, సమాజహిత చిత్రాలతో సంస్కృతికి పట్టం కట్టేలా  క్యాలెండర్ ఉండటం అభినందనీయ మన్నారు. ఈ సందర్భంగా పత్రిక యాజమాన్యానికి , పాత్రికేయలుకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పత్రిక నియోజకవర్గ ఇంచార్జి మారాసు సుధీర్, సామాజిక సేవకులు కర్నె బాబురావు పాల్గొన్నారు.