31-01-2026 12:04:25 AM
వనపర్తి, జనవరి 30 (విజయక్రాంతి): వనపర్తి జిల్లా కొత్తకోట బీసీ బాలికల వసతి గృహంలో పుడ్ పాయిజన్ కావడంతో 30 మంది విద్యార్థినులు అస్వస్థత గురై ఆసుపత్రి పాలైన సంఘటన శుక్రవారం రాత్రి చో టు చేసుకుంది. విద్యార్థినులు తెలిపిన వివరాల మేరకు శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో వాసనతో కూడిన పప్పు వల్ల పుడ్ పాయిజన్ జరిగిందన్నారు.
అస్వస్థతకు గురైన 30 మంది విద్యార్థినులను హుటాహుటిన వసతి గృహం సిబ్బం ది జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్, బీఆర్‌ఎస్ నాయకులు గట్టు యాదవ్, అభిలాష్‌లు సైతం వేర్వేరుగా ప్రభుత్వ ఆసుపత్రి కి చేరుకొని పుడ్ పాయిజన్ కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు మంచి వైద్యాన్ని అందించాలని వైద్యులకు సూచించారు.