calender_icon.png 31 January, 2026 | 1:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగ్రోస్ కేంద్రంలో బస్తా యూరియా @ రూ.50 అదనం

31-01-2026 12:00:00 AM

  1. రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే చర్యలంటూ అధికారుల బుకాయింపు. 
  2. అధికారుల మద్దతుతో యూరియా అక్రమ వ్యాపారం

కల్వకుర్తి జనవరి 30: ఒకపక్క ఎరువులపై నూతన నిబంధనలు, సంస్కరణలు తీసుకొస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తుండగా, మరోపక్క కొందరు వ్యాపారులు మాత్రం కొత్త సాకులతో ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తూ రైతులను దోచుకుంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక మొత్తం వసూలు చేసి, రసీదు ఇవ్వకుండా చేతులు దులుపుకుంటున్నారు. ప్రైవేటు వ్యాపారులే కాకుండా, ప్రభుత్వ అనుసంధానంతో నడిచే ఆగ్రోస్ సేవా కేంద్రాల్లో కూడా ఇదే తరహా అక్రమాలు కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది.

నిబంధనల ప్రకారం రూ. 265 ఉండాల్సిన యూరియా బస్తాను రూ.300లకు విక్రయించడం, యూరియా కొనుగోలుకు ఇతర మందులు తప్పనిసరిగా కొనాలంటూ లింకులు పెట్టడం సర్వ సాధారణంగా మారింది. అయినా సంబంధిత శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూరియా సరఫరాలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ప్రభు త్వం యాప్ ద్వారా బుకింగ్ అవకాశం క ల్పించినా, యాప్లో బుక్ చేసుకున్న రైతులు దుకాణానికి వెళితే అక్కడ అదనంగా డబ్బు లు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం కార్యాల యాలకే పరిమితమై, క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయకపోవడంతో అక్రమాలకు అడ్డు కట్ట వేయలేకపోతున్నారని రైతులు విమర్శిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతి లోని ఓ ఆగ్రో సేవా కేంద్రానికి రైతు యాప్ లో బుక్ చేసుకుని వెళ్లగా ఒక్కొక్క బస్తాకు రూ, 35 అదనంగా వసూలు చేశారు.నిరక్షరాసులైన రైతులను లక్ష్యంగా చేసుకొని కొందరు వ్యాపారులు దందా కొనసాగిస్తున్నప్పటికీ, వారిపై ఇప్పటి వరకు గట్టి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

అధిక ధరల విషయా న్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే, రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే చర్యలు అంటూ బాధ్యత తప్పించుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నిబంధనల ప్రకా రం, ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువగా విక్రయించినా సంబంధిత దుకా ణ యజమానికి జైలు శిక్షతో పాటు లైసెన్స్ రద్దు చేసే వెసులుబాటు ఉం ది. అయినప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమ వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నాయి.

ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయి లో తనిఖీలు నిర్వహించి, రైతు పక్షాన నిలబడి అక్రమాలకు పాల్పడుతున్న వ్యాపారు లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయమై కల్వకుర్తి ఏవో సురేష్ కుమార్ ను వివరణ కోరగా అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని దుకాణ యజమానులకు నోటీసు లు జారీ చేయడం జరిగిందని తెలిపారు.

విచారించి చర్యలు తీసుకుంటాం

జిల్లాలో రైతులకు సరిపడా యూరి యా అందుబాటులోనే ఉంచాం. అనవసరంగా వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ అధిక ధరలకు అమ్ముకోవాలని చూస్తే చర్యలు తీసుకుంటాం. యూ రియా పంపిణీలో అధికారులు కూడా అలసత్వం వీడాలి. ప్రభుత్వ అనుబంధ ఆగ్రోస్, ఇతర వ్యాపారులు అధిక ధరకు యూరియా అమ్మినట్లు తేలితే లైసెన్సులను కూడా రద్దు చేస్తాం. 

 యస్వంత్ రావు,

వ్యవసాయ శాఖ అధికారి,

నాగర్ కర్నూల్ జిల్లా