13-09-2025 03:34:05 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ విద్యాసం స్థలో జిల్లా రవాణా శాఖా ఆధ్వర్యంలో శుక్రవారం ట్రాఫిక్ అవేర్నెస్, రోడ్ సేఫ్టీ కార్యక్ర మం నిర్వహించారు. ఈ కార్యక్రమం విద్యార్థులు, సిబ్బందికి ట్రాఫిక్ నియమాలు, రోడ్ సురక్షిత విధానాలు గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని శ్రీ సుభాష్ చంద్ర రెడ్డి, రీజనల్ ట్రాన్స్పోర్ట్ అధికారి గారి తరఫున అసిస్టెంట్ మోటర్ వాహన ఇన్‌స్పెక్టర్ అనూషా సత్యా, ఆమె బృందం పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ..
ట్రాఫిక్ నియమాలు పాటించడం, హెల్మెట్, సీట్బెల్ట్ ధరించడంపై అవగాహన కల్పించారు. మద్యం తాగి వాహనాలు నడుపొద్దన్నారు. కార్యక్రమం చివరలో రోడ్డు నియమాలు పాటించి, రోడ్డు భద్రత కోసం కృషి చేయాలని విద్యార్థులు, సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. గురునానక్ విద్య సంస్థల వైస్ చైర్మన్, గురునానక్ యూనివర్సిటీ ఛాన్సలర్ సర్దార్ గగనదీప్ సింగ్ కోహ్లీ, మేనేజింగ్ డైరెక్టర్, గురు నానక్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్ట ర్ హెచ్‌ఎస్ సైనీ కార్యక్రమానికి హాజరైన అధికారు లకు హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియచే శారు
కార్యక్రమంలో డాక్టర్ కె. వెంకటరావు ప్రిన్సిపాల్, డాక్టర్ ఎస్ శ్రీనాథరెడ్డి డైరెక్టర్, డాక్టర్ సం జీవ్ శ్రీవాస్తవ డైరెక్టర్, డాక్టర్ పి. పార్థసారధీ జాయింట్ డైరెక్టర్,శ్రీమతి బాల త్రిపుర సుందరి- కో ఆర్డినేటర్ మరియు ఇతర విభాగ అధిపతులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.