29-09-2025 12:15:41 AM
బక్కి వెంకటయ్య
మిర్యాలగూడ సెప్టెంబర్ 29 (విజయ క్రాంతి) : యూరియా కోసం ధర్నా చేసిన విషయంలో ఈ నెల 9న ఎస్త్స్ర శ్రీకాంత్ రెడ్డి దామచర్ల మండలం కొత్త తండాకు చెందిన సాయి సిద్ధుపై అకారణంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఎస్త్స్రను వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా ఎస్పీని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. ఆదివారం సాయి సిద్ధూను ఆయన పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయి సిద్దు యూరియా కొరతతో రైతులతో కలిసి ధర్నా చేస్తుండగా ఇరు వర్గాల పోట్లాటతో స్టేషన్కు వెళ్లిన సాయి సిద్ధును తీవ్ర పదజాలంతో దూషిస్తూ థర్డ్ డిగ్రీ ప్రయోగించడం సరికాదన్నారు. సాయి సిద్ధులు అకారణంగా కొట్టడమే కాకుండా వారి కుటుంబం పై అసభ్య పదజాలంతో దూషించడం తగదని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఎస్‌ఐ ఈ ఈ రకంగా ప్రవర్తించడం కంచే చేను మేసిన తీరుగా ఉందని అన్నారు.
అన్యాయం జరిగినప్పుడు ఫిర్యాదు చేసేందుకు ప్రజలు పోలీసుల దగ్గరికి వస్తే పోలీసులే ఇలా ప్రవర్తిస్తే ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను కాపాడాల్సిన ఎస్‌ఐ తప్పు చేస్తే ఎలా అని తప్పు చేసిన వారిని శిక్షించేందుకు చట్టం ఉందని కొట్టాల్సిన అవసరం ఎస్త్స్ర కి లేదని అన్నారు. ఎస్టి లంబాడ అని సాయి సిద్ధును తిట్టడం దారుణం అని సాయి సిద్దు పై థర్డ్ డిగ్రీ ప్రయించడం కరెక్ట్ కాదని అన్నారు.
ఈ ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి ఎస్త్స్ర శ్రీకాంత్ రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఎస్పీని ఆదేశించారు ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడుతానని తెలిపారు. ఫోన్ ద్వారా రాష్ట్ర షెడ్యూలు కులాల సంక్షేమ శాఖ మంత్రి నల్గొండ ఇన్చార్జి మంత్రి అట్లూరి లక్ష్మణ్ తో మాట్లాడటం జరిగిందని సాయి సింధు కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరానని తెలిపారు. ఎస్సీ కమిషన్ సభ్యులు జిల్లా శంకర్ రాథోడ్ రాంబాబు జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి శశికళ గిరిజన సంక్షేమ అధికారి చత్రు నాయక్ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు తాసిల్దార్ జవహర్లాల్ తదితరులు పాల్గొన్నారు