calender_icon.png 29 August, 2025 | 8:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్ర వినాయకుడి ఆలయం జలమయం

29-08-2025 05:38:35 PM

కుభీర్: తెలంగాణ సరిహద్దులని మహారాష్ట్ర నాందేడ్ జిల్లా బ్రోకర్ తాలూకా లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాలజ్ కర్ర వినాయకుడి ఆలయం గురువారం రాత్రి కురిసిన భారీ వర్షాలతో జలమయమైంది. పక్కనే ఎలా వాగు పొంగిపొర్లడంతో ప్రధాన రహదారిలోని హై లెవెల్ వంతెనకు అనుకొని వరద నీరు ప్రవహిస్తుంది. ఈ కారణంగా ఆలయంలో చేరిన వరద నీరు బయటకు వెళ్లకపోవడంతో ఆలయం పరిసరాలన్నీ వరదనీటిలో మునిగిపోయాయి.

ఆలయ ప్రధాన ద్వారం వరకు చేరిన వరద నీరు సాంస్కృతిక కళా మండపం, అన్నదాన మండపం, క్యూలైన్లలో వరద నీరు చేరింది. ఆలయ ఆవరణలో భక్తుల సౌకర్యార్థం వెలిసిన పలు వ్యాపార స్టాళ్లలో వరద నీరు చొరబడింది. పాల చుట్టుపక్కల గ్రామాలకు సైతం  మధ్యాహ్నం వరకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శుక్రవారం వరద ఉధృతి తగ్గడంతో ఉదయం 11 నుండి యధావిధిగా వాహనాలు నడుస్తున్నాయి.