calender_icon.png 20 October, 2025 | 6:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదిరిపోయే లైనప్!

19-10-2025 12:31:27 AM

ప్రభాస్ పుట్టినరోజైన అక్టోబర్ 23వ తేదీ సమీపిస్తుండటంతో ఫ్యాన్స్ ఆధ్వర్యంలో వేడుకల ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ సెలబ్రేషన్స్‌ను నెక్స్ లెవెల్‌కు చేర్చేలా అభిమానులకు సూపర్ ట్రీట్ ఇవ్వనున్నాడట ప్రభాస్. ఏకంగా మూడు సినిమాల అప్డేట్స్ ఆరోజు రానున్నాయి. ‘ది రాజాసాబ్’ నుంచి ఫస్ట్ సాంగ్‌కు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇటీవల హింట్ ఇచ్చాడు. ప్రభాస్ ఇంట్రోలో వచ్చే ఈ పాట మరోస్థాయిలో ఉండబోతోందట. ఇక దర్శకుడు హను రాఘవాపుడితో చేస్తున్న సినిమా అప్డేట్ వస్తుందని డైరెక్టరే ఇటీవలే ఒక ఫంక్షన్‌లో చెప్పారు.

అది కచ్చితంగా టైటిల్ రివీలింగ్ అయ్యుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ‘బాహుబలి: ది ఎపిక్’ అక్టోబర్ 31న విడుదల కానుంది. దీనికి సంబంధించిన ఒక అప్డేట్ రానుందని టాక్. గతంలో ఎన్నడూలేనివిధంగా ఇలా ఒకేరోజు ఇన్ని అప్డేట్స్ వస్తుండటంతో అభిమానుల్లో ఆనందాన్ని ఆకాశాన్ని తాకుతోంది. మరో మూడు భారీ సినిమాల్లోనూ ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో సందీప్‌రెడ్డి వంగాతో చేస్తున్న ‘స్పిరిట్’ షూటింగ్‌ను ‘రాజాసాబ్’ రిలీజ్ తర్వాత ప్రారంభించను న్నారు. ఇక ప్రశాంత్ నీల్‌తో ‘సలార్2’ ఉండనే ఉంది.

ఈ సినిమా 2026 సంవత్సరాంతంలో ప్రారంభించనున్నారు. ఇక దర్శకుడు నాగ్ అశ్విన్‌తో చేయాల్సిన ‘కల్కి2’ పట్టాలెక్కిం చాల్సి ఉంది. ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రభాస్ లైనప్‌లో మరో ప్రాజెక్టు చేరనుంది. ప్రభాస్ దర్శకుడు సుకుమార్‌తో ఓ సినిమా చేయనున్నారు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. ఈ ముగ్గురి కాంబో ఓ మాసివ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనుందని ఫిల్మ్‌నగర్ సర్కిళ్లలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే సైన్ చేసిన ప్రాజెక్టులు పూర్తతే కానీ ప్రభాస్.. దిల్ రాజు కాంపౌండ్‌లో అడుగుపెట్టే పరిస్థితైతే లేదు. అయితే, ‘ఆర్య2’ టైమ్ నుంచి ఈ కాంబో కోసం ఎదురుచూస్తున్నామని, త్వరగా రంగంలోకి దింపేయాలని సూచిస్తున్నారు ఫ్యాన్స్. మరి ఈ కాంబో సెట్ అయ్యేందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో చూడాలి.