calender_icon.png 16 August, 2025 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయోధ్య సేవలు మరువలేనివి

16-08-2025 12:31:10 AM

మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

మణుగూరు, ఆగస్టు 15 (విజయ క్రాంతి) :సుధీర్ఘ కాలంగా సిపిఐ పార్టీలో పేద ప్రజలకు సేవలు అందించిన ఆ పార్టీ సీనియర్ నాయకులు  బొల్లోజు అయోధ్యచారి అకాల మరణం బాధా కరమని, ఆయన సేవలు మరువలేనివని,తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీ ణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అన్నారు. శుక్ర వారం రామానుజవరం లోని అ యోధ్య స్వగృహాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కామ్రేడ్ అయోధ్య ప్రజల సమస్యలపై అనేక పోరాటాలు, ప్రజా ఉద్యమాలు చేసారని, రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందటం బాధాకర మన్నారు. పేద ప్రజలకు ఆయన అందించిన సేవలు మరువలేనివన్నారు. ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిరినాకీ నవీన్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు చందా సంతోష్, మాజీ ఎంపీపీ ఎడారి రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.