calender_icon.png 16 August, 2025 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాపన్న గౌడ్ జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్గా మల్లేష్ గౌడ్

16-08-2025 12:31:05 AM

కట్టంగూరు, ఆగస్టు 15 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆగస్టు 18 న నిర్వహించే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి  ఉత్సవాల కమిటీ కన్వీనర్ గా తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం కలిమెర గ్రామానికి చెందిన గుండాల మల్లేష్ గౌడ్ నీ రాష్ట్ర ప్రభుత్వం రెండవసారి నియామకం చేశారు.

నా నియమకానికి   సహకరించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్లకు గుండాల మల్లేష్ గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గౌడుల ఆవున్నత్యాన్ని మరియు ఎదుగుదలకు తోడ్పాటు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు హైదరాబాదులో ట్యాంక్ బండ్ ఫై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు.