calender_icon.png 14 September, 2025 | 11:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాబోయ్.. విమాన ప్రయాణం

27-06-2025 12:00:00 AM

అహ్మదాబాద్ విమాన దుర్ఘటన తర్వాత ఎయిర్ ట్రావెల్ అంటేనే ప్రయాణికుల్లో గుబులు కలుగుతోంది. జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం విషాదం నింపడమే కాకుండా దేశ విమానయాన సంస్థలపై విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేసింది. గుజరాత్‌లోని సర్దార్ వల్లభ్‌బాయి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కొద్ది నిమిషాల్లోనే పతనమై భీతావహాన్ని సృష్టించింది.

ఆ విమానం మెడికల్ కాలేజీ హాస్టల్ భవన స ముదాయంపై కూలిపోయింది. మొత్తంగా 270 మంది ప్రాణాలు కోల్పోయారు. విమాన బ్లాక్ బాక్స్ లభ్యమైనా, అది పాక్షికంగా ధ్వంసమైంది. దానిని శోధించి, విమాన పతనానికి సంబంధించిన కారణాలను అన్వేషించాల్సి ఉంది. ఆ విమాన దుర్ఘటన తర్వాత ఇప్పటి వరకు 16 ఎయిర్ ఇండి యా విమానాలు గాల్లో ఉండగానే సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నా యి.

వాటిని దారి మళ్లించడమో, వెనక్కి రప్పించడమో జరిగింది. ఇందు లో విదేశాలకు బయలుదేరిన అంతర్జాతీయ విమానాలు ఐదు ఉన్నాయి. మిగతావి విదేశాల్లో బయలుదేరిన తర్వాత సాంకేతిక సమస్యలతో దారి మళ్లినవి ఉన్నాయి. దేశంలోని విమానాశ్రయాల్లో ఇండిగో విమానాలకు కూడా కొన్నిచోట్ల ఇదే సమయంలో సాంకేతిక సమస్యలు ఎదురయినట్లు కూడా వార్తలు వచ్చాయి. వీటితో ప్రయాణికుల్లో గుబులు మరింత పెరిగింది.

విమానాశ్రయాలు, విమాన సంస్థల నిర్వహణలో లోపాలు ప్రయా ణికులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ భయాందోళనలు దేశంలో విమానాల భద్రతపైనే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ యావియేషన్ (డీజీసీఏ) ఇటీవల ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో తనిఖీలు నిర్వహించినప్పుడు అనేక లోపాలు బట్టబయలయ్యాయి. జా యింట్ డైరెక్టర్ జనరల్ నాయత్వంలో రెండు బృందాలు రాత్రినుంచి తెల్లవారు జామువరకు తనిఖీలు జరిపింది.

టేకాఫ్ అయిన విమానం ఆకాశం లోకి పూర్తిగా లేచేందుకు అవసరమైన ‘త్రస్ట్’ రివర్సల్ సిస్టమ్ చాలా విమానాల్లో సరిగా లేదని డీజీసీఏ గమనించింది. అహ్మదాబాద్ విమాన పైల ట్లు తమ చివరి సందేశంలో పని చేయడం లేదని చెప్పింది ఈ ‘త్రస్ట్’ సిస్ట మే. విమానాల నిర్వహణ, భద్రత విషయాల్లో రోజువారీగా అనుసరించాల్సిన ప్రొటోకాల్ అంతంత మాత్రంగానే ఉంది. కొన్ని విమానాశ్రయాల్లో విమానాల సాంకేతిక సమస్యలను పరిష్కరించే వారే కరువైన పరిస్థితులు ఉన్నట్లు డీజీసీఏ తనిఖీల్లో బయటపడింది.

సాంకేతిక పరంగా లాగ్‌బుక్ ఏదైనా నిర్వహిస్తున్నారా అంటే ఆ రికార్డులేవీ లేవని తేలింది. అంతేకాదు, కొన్ని విమానాశ్రయాల్లో, చుట్టుపక్కల కొత్తగా వచ్చిన నిర్మాణాల వల్ల విమానాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితులు తలెత్తా యా అనే డేటా మూడేళ్లుగా సేకరించలేదని తెలిసింది. అంతెందుకు, గత మూడేళ్లలో ఎయిరో డ్యామ్ చుట్టుపక్కల కొత్త నిర్మాణాలేమైనా వచ్చా యా తెలుసుకునేందుకు సర్వే కూడా జరగలేదు.

ఢిల్లీ, ముంబై విమానాశ్రయాలే కాదు, ఇతర విమానాశ్రయాల్లో కూడా తనిఖీలు జరిపినట్లు డీజీసీఏ పేర్కొంది. దేశంలో 21 గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటు ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారత విమాన సంస్థలు 1,700 కొత్త విమానాల కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చాయంటే దేశ పౌర విమానయాన రంగం ఎంతగా వృద్ధిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ప్రయాణికుల భద్రత భారత డీజీసీఏ పైనే ఉంది.