10-12-2025 02:56:12 AM
చేపల ఉత్పత్తితో 5 లక్షల కుటుంబాలకు జీవనోపాధి
ప్రభుత్వ లక్ష్యం 84 కోట్ల ఉచిత చేప పిల్లలు.. పంపిణీ చేసింది 48 కోట్లే
హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): రాష్ట్రంలో మత్స్య సంపదను గణనీ యంగా పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే దశ నుంచి ఎగుమతి చేసే దిశగా ఆలోచన చేస్తున్నది. అయితే అందుకు అనుగుణంగా ఆచరణలో మాత్రం ముందడుగు పడటం లేదని గణాంకాలు చేప్తున్నాయి. రాష్ట్రంలో చె రువులు, రిజర్వాయర్లు కలిపి మొత్తం 26,326 వరకు ఉంటాయి.
వీటిలో ఉచితం గా చేప పిల్లల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.122 కోట్లు బడ్జెట్‌లో కేటాయించింది. ఈ ఏడాది 84.62 కోట్ల చేప పిల్లలను పం పిణీ చేయాలని మత్స్యశాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. ఆగస్టు నుంచి సెప్టెంబర్ లేదంటే అక్టోబర్ వరకు చేప పిల్లలను చెరువులు, రిజర్వాయర్లలో వదిలేందుకు పూర్తిగా పంపి ణీ చేయాల్సి ఉంటుంది. చేప పిల్లల ఉచిత పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైనప్పటికీ డిసెంబర్ రెండో వారం వచ్చి నప్పటికీ లక్ష్యానికి ఆమడదూరంలోనే ఉంది.
నవంబర్ నెలాఖర్‌లోగా మీనాల పంపిణీ పూర్తి చేయాలని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి సంబంధిత అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ 60 శాతం (48 కోట్లు) చేప పిల్లలను కూడా పంపిణీ చేయలేదని విమర్శలు ఉన్నాయి. మిగతా చేప పిల్లలను పంపిణీ చేస్తారా? సగంలోనే నిలిపివేస్తారా? అనే మీమాంస మత్స్యశాఖ వర్గాల్లో నెలకొన్నది.
అయితే చేప పిల్లల పంపిణీ ఆలస్యం కావడానికి సంబంధిత శాఖ అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని, సర్కార్ కూడా సీరియస్‌గా తీసుకోలేదని మత్స్యశాఖ సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చేపల ఉత్పత్తి, చేపల విక్రయాలపై 5 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని సంబంధిత సంఘాల నాయకులు చెప్తున్నారు.
ఆలస్యంగా వదిలితే.. ఉత్పత్తిపై ప్రభావం
చేప పిల్లలను చెరువులు, రిజర్వాయర్లలో ఆగస్టు నుంచి సెప్టెంబర్ లేదంటే అక్టోబర్ వరకు వదిలితే మత్స్య సంపద గణనీయంగా పెరడగానికి అవకాశం ఉంటుంది. చేప పిల్లలను రిజర్వాయర్లలో వదిలిన తర్వా త వర్షాలు పడితే చేపల వృద్ధి ఉంటుందని చెప్తున్నారు. దీంతో సర్కార్ అనుకున్న లక్ష్యానికి అటు ఇటుగా మత్స్య సంపద పెరు గుతుంది. కానీ చేపల పంపిణీ ఆలస్యం కావ డం వల్ల ఉత్పత్తిలో భారీగా తేడా వస్తుందని మత్స్యకార సొసైటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
చేపల్లో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ ఈసారి మీనా రకం చేపలను ఎక్కువగా పంపిణీ చేయాలని మత్స్య శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో 26 వేలకుపైగా చెరువు లుంటే.. మీనాలను కేవలం 4,447 చెరువుల్లోనే వదిలినట్టు సమాచారం. ఇంకా 21 వేలకుపైగా చెరువుల్లో మీనాలను వదలాల్సి ఉంది. ఈ ఏడాది చివరలో చెరువుల్లో వదిలిన మీనాలు వృద్ధి చెందాలంటే కనీసం ఏడాది పడుతుందని, అది కూడా చెరువుల్లో పూర్తిగా నీళ్లు ఉండి, ఎలాంటి ఇబ్బందులు లేకపోతేనే అనుకున్న మేరకు చేపల వృద్ధి సాధ్యమవుతుందని మత్స్యకార సొసైటీలు చెప్తున్నాయి.
లేదంటే చేపలు వట్టిపోయి ఉపయోగం లేకుండా పోతాయని మత్స్యకా రులు ఆందోళన చెందుతున్నారు. దీంతో మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న చేప పిల్లల పంపిణీ కార్యక్రమం వృథా అవుతుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నా రు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రావ డం వల్ల.. చేప పిల్లల పంపిణీకి బ్రేక్ పడిందని అధికారులు పేర్కొంటున్నారు.