calender_icon.png 11 September, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాగును దాటి.. వైద్యం అందించి

11-09-2025 12:19:28 AM

బోథ్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి) : బజర్‌హత్నూర్ మండలంలోని కొత్తపల్లిలో బుధవారం వైద్య సిబ్బంది హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడానికి నానా అవస్థలు పడ్డా రు. నడుచుకుంటూ వెళ్లి గ్రామానికి  చేరుకువాల్సి ఉంటుంది. ఐతే భారీ వర్షాలతో గ్రామ సమీపంలోని వాగు వరద నీటితో  ప్రవహించడంతో వైద్య సిబ్బంది తంటాలు పడుతూ వాగు దాటి హెల్త్ క్యాంపు ను ఏర్పాటు చేశా రు.

గ్రామంలో ఇంటింటా తిరుగుతూ వ్యాధి గ్రస్తులను పరీక్షించి అవసరమైన వారికి ఉచితంగా మందుల పంపిణీ చేశారు. మండల కేంద్రానికి కేవలం ౩ కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడం దురదృష్టకరం. ఎమర్జెన్సీలో ఆ గ్రామ స్తులకు దేవుడే దిక్కు అని వైద్య సిబ్బంది అంటున్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి భీమ్రావు సిబ్బంది కళ్యాణి, అనిత, శంకర్, ఆశాలు దురపత, శకుంతల, సవిత సంగీత తదితరులు పాల్గొన్నారు.