27-12-2025 06:55:56 PM
బేలలో హిందూ సంఘాల నిరసన
బేల,(విజయక్రాంతి): బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న మారణ హోమాన్ని నిరసిస్తూ బేలా మండల కేంద్రంలో బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. శనివారం నిరసన ర్యాలీ చేపట్టి శివాజీ చౌక్ లో జాతీయ రహదారిపై దిష్టిబొమ్మ దగ్ధం చేసి, నిరసన నినాదాలతో హోరెత్తించారు.
ఈ సందర్భంగా బజరంగ్ దళ్ జిల్లా ధర్మ ప్రచార ప్రముఖ శ్రీరామ్ శర్మ మాట్లాడుతూ... పలు ఇతర దేశాలలో హిందువులపై పైౖశా చికంగా ఉన్మాది చర్యలకు పాల్పడడం హేయమన్నారు. బంగ్లాదేశ్ లో హిందూ యువకుడిని పెట్రోల్ పోసి తగలబెట్టడం దారుణమన్నారు. ఇటువంటి సంఘటనలను ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. ఇప్పటికైనా హిందువులంతా మేల్కొని ఐక్యంగా ఉంటూ ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రతిఘటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.