calender_icon.png 22 September, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బహుజన తేజం కొండా లక్ష్మణ్

22-09-2025 12:40:52 AM

ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి

ముషీరాబాద్, సెప్టెంబర్ 21(విజయక్రాంతి): ప్రముఖ స్వాతంత్ర సమరయోధు లు, తొలితరం తెలంగాణ ఉద్యమ నాయకులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ13వ వర్ధంతి ని ఆదివారం  చిక్కడపల్లిలోని బీసీ పొలిటికల్ ఫ్రెంట్ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ముందుగా ఆయ న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనం గా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బీసీ సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ఎస్. దుర్గయ్య గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రెంట్ రాష్ట్ర నాయకులు అయిలి వెంకన్న గౌడ్ లు మాట్లాడు తూ ప్రత్యేక రాష్ట్ర సాధనకై తన మంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేసిన మహ నీయుడు, తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా జలదృశ్యంలో గల తన ఇల్లును కార్యాలయానికి అంకితం ఇచ్చిన ఘనత కొండా లక్ష్మణ్ బాపూజీ కే దక్కుతుందని కొనియాడారు.

అనునిత్యం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం పరితపించిన బహుజన నాయకులు, వారి చిరకాలం స్వప్నం సాకా రం రాష్ట్రం ఏర్పాటును చూడకుండా మరణించడం బాధాకరమన్నారు. ఈ కార్యక్ర మంలో  రచయిత సంఘం రాష్ట్ర అధ్యక్షులు బైరు శేఖర్, బీసీ ఇంటలెక్షవల్ ఫోరం రాష్ట్ర నాయకులు వేణు, కేశంమోని శ్రీనివాస్ గౌడ్, శ్రీరాములు గౌడ్, క్షపతి చారి,  హరి ప్రసాద్, ఇంటలెక్షవల్ ఫోరం కో- ఆర్డినేటర్ కె.వి గౌడ్, సీలం శ్రీనివాస్, ఇడం అంజనేయులు పాల్గొన్నారు.