12-10-2025 12:00:00 AM
బాలాగోపాల్ తన హక్కుల ఉద్యమ క్రమంలో విధ్వంసకర అభివృద్ధి విధానాలపై ఉమ్మడి రాష్ర్టంలో అట్టడుగు వర్గాల ప్రజల గొంతుకగా నిలబడిన తీరు పాలకులను సైతం ఆలోచింపచేసేది. భూ నిర్వాసితులను జాగృతం చేస్తూ రైతుల ప్రయోజనాలే కాకుండా, వారిపై ఆధారపడి నివసిస్తున్న భూమి లేని వ్యవసాయ కూలీల జీవనాన్ని నిలబెట్టేందుకు ఆయన చేసిన పోరాటం ఆదర్శనీయమైనది.
పరపతి, పలుకుబడి ఉన్నోళ్లకు ఒక న్యాయం.. లేనోళ్లకు అన్యాయం జరుగుతున్న ఈ ఆధునిక సమాజంలో.. ఒక మనిషికి ఒకే విలువ ఉండాలి అంటూ సామాజిక అంతరాలను, చట్టాల అమలులో వివక్షను ప్రజల ముందు చర్చకు పెట్టి, పాలకులను ప్రశ్నిస్తూ, పీడిత జనం పక్షాన పోరాడి నిలిచిన హక్కుల మేధావి డాక్టర్ బాలగోపాల్. ఆయన మరణం తెలుగు సమాజంలోనే కాదు యావత్ భారతదేశ ప్రజా ఉద్యమాలకు తీరని బాధను మిగిల్చింది.
సరిగ్గా 16 ఏళ్ల క్రి తం అక్టోబర్ 8, 2009న ఆయన హైదరాబాద్‌లో మరణించారు. 1952లో బళ్లారి లో జన్మించిన బాలగోపాల్ హైస్కూల్ విద్యాభ్యాసం తిరుపతిలో జరిగింది. ఇంటర్మీడియట్ కావలిలోనూ, డిగ్రీ ఎస్వీ యూనివర్సిటీ తిరుపతిలో పూర్తి చేశారు. డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే బెర్ట్రాండ్ రస్సెల్ వ్యాసాలకు ఆకర్షితుడై సామాజిక అవగాహన పెంచుకున్నారు.
వరంగల్‌లోని రీజినల్ ఇంజనీరింగ్ కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మేథమెటిక్స్‌లో పూర్తి చేసి అక్కడే పీహెడీ పట్టాను కూడా పొందారు. అప్పటికే వరంగల్ ఉద్యమాలకు కేంద్ర బిందువుగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రగతిశీల ఆలోచనల పట్ల తన అవగాహన దృక్పథాన్ని పెం చుకున్నారు. అప్పటి నుంచి మొదలు చనిపోయేంత వరకు కూడా అదే ఆచరణను కొనసాగించిన బుద్ధి జీవి బాలగోపాల్.
ఆయన ఆదివాసుల సమస్యల పట్ల చా లా సునిశితమై న పరిశీలనతో పరిష్కారాలు వెతికేవా రు. ఆదివాసుల అభివృద్ధికి అడ్డుగా నిలిచిన చట్టాలను, బడా కార్పొరేట్ కంపెనీలను కోర్టులో నిలబెట్టి ప్రశ్నించిన ఆదివాసీ లాయర్‌గా పేరుగాంచారు. భూనిర్వాసితుల సమస్య పట్ల చిత్తశుద్ధితో కూడిన ప్ర జాస్వామ్య పోరాటానికి మద్దతు ఇచ్చేవారు.
ప్రజల గొంతుకై
బాలాగోపాల్ తన హక్కుల ఉద్యమ క్రమంలో విధ్వంసకర అభివృద్ధి విధానాలపై ఉమ్మడి రాష్ర్టంలో అట్టడుగు వర్గాల ప్రజల గొంతుకగా నిలబడిన తీరు పాలకులను సైతం ఆలోచింపచేసేది. భూ నిర్వాసితుల ను జాగృతం చేస్తూ చిన్న, సన్న కారు రైతుల ప్రయోజనాలే కాకుండా, వారిపై ఆధారపడి నివసిస్తున్న భూమి లేని వ్యవసాయ కూలీల జీవనాన్ని నిలబెట్టేందుకు ఆయన చేసిన పోరాటం ఆదర్శనీయమైనది.
దేశంలోని నలుమూలల నుంచి మేధావులను ఆ ప్రాం తాల్లోకి తీసుకొచ్చి ఆ ప్రాంత ప్రజలకు జరుగుతున్న అన్యాయం పట్ల కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు కనువిప్పు కలిగే లాగా ప్రజలను సమీకరిస్తూ తమ హక్కుల కోసం ప్రజలు స్వతహాగా నిలబడేలాగా స్ఫూర్తిని అందించిన ఆదర్శనీయమైన, అరుదైన హక్కుల మేధావి బాలగోపాల్. నేడు భారతీయ సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సరైన పరిష్కారాలను చూపగలిగే మేధావి ఆయన.
అందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా గత సంవత్సరం సుప్రీం కోర్టు ఎస్సీ రిజర్వేషన్‌పై ఇచ్చిన తీర్పులో బాలగోపాల్ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు కోట్ చేయడమే ఇందుకు నిదర్శనం. సామాజిక వివక్షకు గురవుతున్న వర్గాల పట్ల బాలగోపాల్‌కు ఉన్న అవగాహన, దృ క్పధం ఎంతో విలువైనది అని సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది.
ప్రశ్నించే తత్వం
గత 16 ఏళ్లలో పాలకులు హరిస్తున్న హక్కులను సాధించుకోవడంలో బాలగోపాల్ సహచరులు ఏ ర్పాటు చేసుకున్న మానవ హక్కుల వేదిక తీవ్రమైన కృషి చేస్తున్నప్పటికీ ఆయన లేని లేటు మాత్రం స్ప ష్టంగా కనిపిస్తోంది. ఆదివాసీ సమాజంలో చిధ్రమవుతున్న జన జీవితాలను నాగరిక సమాజం ముందు నిలబెట్టడానికి, న్యాయ సహాయం అందించడానికి,
తా ము కోల్పోతున్న అనేక హక్కులను వారికి అందించడానికి పీడితుల పక్షపాతి బాలగోపాల్ సార్ లే కపోవడం విషాదకరమైన పరిణామం. దేశంలో అభద్రతా భావంలోకి నెట్టబడిన మహిళలు, అణగారిన వ ర్గాలు, దళితులు, ఆదివాసీలు, మైనార్టీల రక్షణ కోసం కనీసంగా గొంతెత్తడమే మనం బాలగోపాల్‌కు ఇచ్చే నిజమైన నివాళిగా భావిద్దాం.
వ్యాసకర్త సెల్: 9849789779