calender_icon.png 7 November, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలంరాయి మహిళల కాళేశ్వరం యాత్ర

07-11-2025 12:00:00 AM

ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారం..

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 6 (విజయక్రాంతి): ఆర్టీసీ సంస్థ చేపట్టిన యాత్రాదానం కార్యక్రమంలో భాగంగా కం టోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తన నియో జకవర్గంలో ఆర్థిక ఇబ్బందులతో దైవ దర్శ నానలకు వెళ్లలేని, ఎవరూ తోడు లేక ఆల యాల సందర్శనకు వెళ్లలేని వారికి పవిత్ర కార్తీక మాసం సందర్భంగా కాళేశ్వరం యా త్రను ఏర్పాటు చేశారు.

ఈ యాత్రలో భా గంగా నియోజకవర్గంలోని బాలంరాయి నుంచి మహిళలను కాళేశ్వరం యాత్రకు గురువారం ఉదయం బస్సు యాత్రగా వెళ్లా రు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ బస్సు వద్ద పూజలు చేసి, బస్సును ప్రారంభించారు. యాత్రదానం వంటి మంచి కార్యక్రమానికి దాతలు ముందుకు వచ్చి పేదవారు, తోడులేక వెళ్లలేని వారికి ఆలయాల సందర్శన భాగ్యం కల్పించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీధర్ పాల్గొన్నారు.