07-11-2025 12:00:00 AM
మా దగ్గర ఆధారాలున్నాయ్: ఫతి
హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): విద్యాశాఖ సెక్రటరీ, సాంకేతిక, కళాశాల విద్యా కమిషనర్ శ్రీదేవసేనకు తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం మద్దతు తెలిపింది. శ్రీదేవసేనపై తెలంగాణ ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలు (ఫతి) చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఐఏఎస్ అధికారిణిపై అసమంజసమైన, ఆధారంలేని ప్రకటనలను ఫతి ఉప సంహరించుకోవాలని ఐఏఎస్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది.
ఇదిలా ఉంటే బుధవారం ఫతి నేతలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీదేవసేనను బదిలీ చేయాలని, తమను యూజ్‌లెస్ కాలేజీలు అన్నారని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను ఐఏఎస్ అధికారుల సంఘం తప్పుబట్టింది. దీనిపై తమ వద్ద ఆధారాలున్నాయని ఫతి లోని ఓ నేత ‘విజయక్రాంతి’కి తెలిపారు.