26-07-2025 12:10:54 AM
న్యూఢిల్లీ, జూలై 25: ఓటీటీ (ఓవర్ ది టాప్)ల్లో పలు యాప్‌లు అశ్లీల కంటెంట్‌ను ప్రసారం చేస్తుండడంపై కేంద్రం కఠిన చర్యలకు దిగింది. ఈ నేపథ్యంలో అశ్లీల, అభ్యం తరకర కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న 25 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై కొరడా ఝుళిపించిం ది. ఉల్లు, ఏఎల్‌టీటీ, దేశీ ఫ్లిక్స్ సహా మొత్తం 25 ఓటీటీ యాప్‌లు, వెబ్‌సైట్లపై నిషేధం వి ధించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్ర సార మంత్రిత్వ శాక దీనిపై నోటిఫికేషన్ జా రీ చేసింది.
‘ఉల్లు, ఏల్‌టీటీ, బిగ్ షాట్స్, దేశీఫ్లిక్స్, గులాబ్ యాప్ వంటివి పలుమార్లు నిబంధనలను ఉల్లంఘించి తమ మాధ్యమా ల్లో అశ్లీల కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నాయని గుర్తించాం. అందుకే వాటిపై కఠిన చర్యలు తీసుకున్నాం’ అని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ పేర్కొంది.
ఓటీటీ ప్ర సార యాప్‌లు, వాటి సర్వీస్ ప్రొవైడర్లు తా ము ప్రసారం చేసే కంటెంట్‌పై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేంద్రం ఈ సంద ర్భంగా గుర్తుచేసింది. భారతీయ చట్టాలను ఉల్లంఘించే కంటెంట్‌ను ప్రసారం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హె చ్చరించింది.
కేంద్రం నిషేధించిన ఓటీటీ యాప్స్ ఇవే..
ఉల్లు, ఏఎల్‌టీటీ, దేశీఫ్లిక్స్, బిగ్ షాట్స్, బూమెక్స్, నవరస లైట్, గులాబ్ యాప్, కం గన్ యాప్, బుల్ యాప్, జల్వా యాప్, వా వ్ ఎంటర్‌టైన్‌మెంట్, లుక్ ఎంటర్‌టైన్‌మెం ట్, హిట్‌ప్రైమ్, షోఎక్స్, సోల్ టాకీస్, అడ్డా టీవీ, హాట్ ఎక్స్ వీఐపీ, హల్‌చల్ యాప్, మూడ్‌ఎక్స్, నియాన్‌ఎక్స్, వీఐపీ, ప్యుగి, మోజ్‌ఫిక్స్, ట్రైఫ్లిక్స్.