calender_icon.png 2 August, 2025 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు!

26-07-2025 12:08:50 AM

ఆర్బీఐ గవర్నర్ సంజయ్ 

ముంబై, జూలై 25: యూపీఐ పే మెంట్లపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేవారు. యూపీఐ ద్వారా పూ ర్తిగా ఉచిత డి జిటల్ లావాదేవీల శకం శాశ్వతంగా ఉండకపోవచ్చని సూచించారు. భవి ష్యత్తులో యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు విధించే అవకాశముందని గుర్తుచేశారు. శుక్రవారం బీఎఫ్‌ఎస్‌ఐ సమ్మిట్‌కు హాజరైన సం జయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. ప్రస్తుతం యూ పీఐ ఎలాంటి యూజర్ ఛార్జీలు లే కుండా కొనసాగుతుందన్నారు.

అ యితే ఈ వ్యవస్థ సజావుగా కొనసాగేందుకు ప్రభుత్వం బ్యాంకులు, ఇతర లావాదేవీ సంస్థలకు సబ్సిడీ ఇ స్తోందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని యూపీఐ విధానంలో చెల్లింపు లకు ఎలాంటి ఛార్జీలు విధించడం లేదని తెలిపారు. ఈ ఖర్చులు ప్రభుత్వానికి భారంగా మారుతున్నా యని.. సురక్షితమైన డిజిటల్ చెల్లింపులకు కట్టుబడి ఉన్నామన్నారు. కానీ దీర్ఘకాలంలో ఇది స్థిరంగా కొనసాగాలంటే ఖర్చులు చెల్లించక తప్పదని పేర్కొన్నారు.