31-08-2025 12:52:09 AM
నాబార్డ్, ఏడీబీ నుంచి లోన్ తీసుకొని నిర్మాణం
హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం కోసం రూ.8 వేల కోట్ల రుణం తీసుకోనుంది. ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ), నాబార్డ్ నుంచి ఈ రుణం తీసుకుంటోంది. ఈ రుణాన్ని నాలుగేళ్లకు గానూ తీసుకోవాలని నిర్ణయించినట్టు సమచారం. ఏడాదికి రూ.2 వేల కోట్ల చొప్పున రుణం పొంది స్కూళ్ల నిర్మా ణం పూర్తి చేయనున్నారు.
అంతేకాకుండా ఈ స్కూళ్ల నిర్మాణానికి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను కూడా వినియోగించనున్నట్టు తెలిసింది. అయితే ఈ స్కూళ్ల నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకు 76 వాటికి టెండర్లు పిలిచినట్టు సమాచారం. మరో 14 స్కూళ్లకు అప్రూవల్ లభించగా, 18 అవల్యూషన్ స్టేజ్‌లో ఉన్నాయి. ఒక్కో స్కూ ల్ నిర్మాణానికి రూ.200 కోట్ల చొప్పున నిధులను ఖర్చు చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్కూళ్లను నిర్మిం చనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అధికారులు ఆ దిశగా పనుల్లో వేగం పెంచారు.