14-09-2025 12:14:24 AM
హుజుర్‌నగర్, సెప్టెంబర్ 13(విజయక్రాం తి): భర్త మరణించి అంత్యక్రియలు పూర్తయిన 24 గంటల్లోపే ఆ బాధ తట్టుకోలేక గుండెపోటుతో భార్య చనిపోయిన ఘటన సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్ పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. హుజూర్‌నగర్ మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ గెల్లి అర్చనారవి మామ ప్రముఖ వ్యాపారవేత్త,
రైస్ మిల్ అసోసియేషన్ మా జీ అధ్యక్షుడు గెల్లి అప్పారావు(80) మూడు రోజుల క్రితం హార్ట్ ఎటాక్ రావడంతో ఇం ట్లోనే మృతి చెందాడు. ఆయన అంత్యక్రియలను శుక్రవారం పూర్తి చేశారు. అయితే భర్త మరణం తట్టుకోలేక ఆయన భార్య అరు ణ(71) శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందింది. భర్త చనిపోయిన రెండోరోజునే భార్య మరణించడం అందునా ఇద్దరి మృతికి కారణం గుండెపోటు కావడంతో తీవ్ర విషాదం నెలకొంది.