calender_icon.png 14 September, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగల కోసం వృద్ధురాలి హత్య!

14-09-2025 12:10:56 AM

  1. అనుమానాస్పద కేసుగా పోలీసుల నమోదు
  2. నెల్లికుదరులో ఘటన

మహబూబాబాద్, సెప్టెంబర్ 13(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా నెల్లికుదు రు మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి నగలు కోసం వృద్ధురాలిని హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. నెల్లికుదురు గ్రామానికి చెందిన వీరగాని రాధమ్మ (80)  ఒంటరిగా ఇంట్లో నివసిస్తోంది. నగలపై కన్నేసిన దుండగులు రాత్రి ఇంట్లోకి వచ్చి ఉంటా రని ప్రచారం సాగుతోంది.  ఆమె మృతదే హం ఇంటి పక్కనే ఉన్న చేద బావిలో శనివా రం కనిపించింది.

అలాగే వృద్ధురాలి చేతిలో బంగారు గొలుసు ఉండడం స్థానికులు గమనించారు. బహుశా బంగారు నగల కోసమే ఆమెను దుండుగులు హత్య చేసి ఉంటారని ప్రజలు భావిస్తున్నారు. రాధమ్మ మృతిపై ఆమె కొడుకు మల్లేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ సీహెచ్ రమేష్‌బాబు తెలిపారు.