22-12-2025 12:00:00 AM
అశ్వాపురం, డిసెంబర్ 21 (విజయక్రాంతి): దేశానికి అహింసా మార్గంలో స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహనీయుడు మ హాత్మా గాంధీ పేరును ఉపాధి హామీ పథకం నుండి తొలగించడం కేంద్ర ప్రభుత్వ దుర్మార్గపు చర్య అని అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య ఆగ్ర హం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ‘బాపూజీ రాంజీ’గా మార్చడాన్ని నిరసిస్తూ ఆదివారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పా ర్టీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.
ర్యాలీ, రాస్తారోకోతో హోరెత్తిన నిరసన
కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా స్థానిక హెవీ వాటర్ ప్లాంట్ కాలనీ గేటు నుండి మండల పార్టీ కార్యాలయం (ఓరుగంటి వీరయ్య భవన్) వరకు కాంగ్రెస్ శ్రేణు లు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అభివృద్ధి చేతకాకే పేర్లు మారుస్తున్నారు: ఓరుగంటి బిక్షమయ్య
ఈ సందర్భంగా ఓరుగంటి బిక్షమయ్య మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని మం డిపడ్డారు. పేదలకు అండగా నిలిచేందుకు 2004లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం నుండి, జాతిపిత పేరు ను తొలగించడం నీచమైన చర్య అని ధ్వజమెత్తారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 18 లక్షల 30 వేల ఉపాధి హామీ జాబ్ కార్డులను తొ లగించి పేదల పొట్టకొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ ప్రభుత్వానికి అభివృద్ధి, సం క్షేమ పథకాలు అమలు చేయడం చేతకాక, ఇ లాంటి అనవసరపు చర్యలకు పాల్పడుతోందని ఎద్దేవా చేశారు. తక్షణమే పేరు మార్పు బిల్లును వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజలే బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాం గ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి, ఓరుగంటి రమేష్ బాబు, సర్పంచులు సదర్ లాల్, సబ్కా పిచ్చయ్య, ఎస్కే ఖదీర్, మట్టా వీరభద్రం రెడ్డి, ఉప సర్పంచ్ హర్ష నాయక్, కందుల లక్ష్మణ్, గొల్లపల్లి నరేష్, జిమ్మా సమ్మయ్య, శశికాంత్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.