calender_icon.png 22 December, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాచలం డివిజన్ ప్రైవేట్ పాఠశాలల నూతన కమిటీ ఎన్నిక

22-12-2025 12:00:00 AM

అధ్యక్షులుగా అనుమాండ్ల శ్రీధర్ రెడ్డి 

ప్రధాన కార్యదర్శిగా ఎస్వి కిషోర్ 

ట్రెజరర్ గా సానికొమ్ము చైతన్య

భద్రాచలం, డిసెంబర్ 21, (విజయక్రాంతి) భద్రాచలం డివిజన్ ప్రైవేట్ పాఠశాలల నూతన కమిటీ ఆదివారం భద్రాచలంలోని స్థానిక రెడ్డి భవనం నందు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులు బండి లక్ష్మణ్ అధ్యక్షతన ఎన్నికల నిర్వహణ కమిటీ అబ్రహం, మునికేశవ్ లు సంయుక్తంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అందరూ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులు అనుమాండ్ల శ్రీధర్ రెడ్డి (జ్యోతి కాన్వెంట్ హై స్కూల్ భద్రాచలం) ,ఎస్ వి కిషోర్ (దివ్య హైస్కూల్ భద్రాచలం),ట్రెజరర్ గా సాని కొమ్ము చైతన్య (ప్రగతి విద్యానికేతన్ సారపాక) లును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

గౌరవ అధ్యక్షులుగా మాగంటి ప్రసాద్ బాబు ( ఎల్ ఎఫ్ స్కూల్ భద్రాచలం), ముఖ్య సలహాదారుగా పలివెల రవికుమార్ ( శ్రీ కోమల హైస్కూల్ భద్రాచలం) ఉపాధ్యక్షులుగా బి నాగేశ్వరరావు ( బ్రిలియంట్ హై స్కూల్ సారపాక), ఎం శశిధర్ రెడ్డి (ఎమ్మెస్సార్ పబ్లిక్ స్కూల్ సారపాక), ఆర్ గౌరీ శంకర్ ( శాంతినికేతన్ చర్ల), జాయింట్ సెక్రటరీగా ఆశిక్ లైక్ పాషా(న్యూ సెంచరీ హై స్కూల్ బూర్గంపాడు), జయ మనికంఠ( గౌతమ్ మోడల్ స్కూల్ భద్రాచలం) కార్యవర్గ సభ్యులుగా పి సురేష్ (సమత స్కూల్ భద్రాచలం), లిఖిత (సరస్వతీ విద్యాలయం తేగడ) లుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్స్ గొడపర్తి రాంబాబు, కోటిరెడ్డి, శ్రీనివాస్,గిరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.