calender_icon.png 31 July, 2025 | 9:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘యముడు’ పెద్ద విజయాన్ని సాధించాలి

29-07-2025 10:51:23 PM

జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి(Jagadish Amanchi) హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్‌గా ‘యముడు’. ఈ సినిమాకు ‘ధర్మో రక్షతి రక్షితః’ అనేది ఉప శీర్షిక.  శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఆడియో లాంచ్ ఈవెంట్ సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రియాంక, మల్లిక మొదటి పాటను, నిర్మాత బెక్కెం వేణు గోపాల్ రెండో పాటను, కే మ్యూజిక్ సీఈవో ప్రియాంక మూడో పాటను, మల్లిక నాలుగో పాటను విడుదల చేశారు. బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. “ఈ మధ్య చిన్న చిత్రాలే వండర్లు క్రియేట్ చేస్తున్నాయి. జగదీష్ ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని తీస్తున్న ‘యముడు’ కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ ”అని అన్నారు.

హీరో, దర్శకుడు జగదీష్ ఆమంచి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎక్కడ చూసినా కుట్రలు, హత్యలు, అక్రమ సంబంధాలకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. ఆ పాయింట్‌లతోనే ఈ చిత్రాన్ని తీశాం. ప్రేక్షకులందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను అని అన్నారు. హీరోయిన్ శ్రావణి శెట్టి మాట్లా-డుతూ.. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. జగదీష్ ప్రాణం పెట్టి ఈ చిత్రాన్ని చేశారు. అందరికీ కనెక్ట్ అయ్యేలా... మన జీవితంలో జరిగే ఘటనల్నే, చేసే తప్పుల్నే ఇందులో చూపిస్తున్నామని అన్నారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే : శివ కుండ్రపు, ఎడిటర్ : కెసిబి హరి, డిఓపి : విష్ణు రెడ్డి వంగా, సంగీతం : భవాని రాకేష్.