calender_icon.png 15 August, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రారంభమైన బాస్కెట్ బాల్ శిబిరం

15-08-2025 12:33:51 AM

మునిపల్లి, ఆగస్టు 14 : మండల పరిధిలోని కంకోల్ వోక్సన్ యూనివర్సిటీలో గురువారం బాస్కెట్ బాల్ శిబిరం ప్రారంభించారు. ఈ శిబిరం ఈనెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని తెలంగాణ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డి, వోక్సెన్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రౌల్ వి.రోడ్రిగేజ్, వోక్సెన్ యూనివర్సిటీ హెడ్ ఆఫ్ స్పోరట్స్ విశాల్  తెలిపారు.

ఈ శిబిరం  తెలంగాణ బాస్కెట్ బాల్  అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ శిబిరంలో  అండర్-18 రాష్ట్ర బాస్కెట్ బాల్ కోచింగ్  ఆగస్టు 30న  ముగుస్తుందని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ట్రయల్స్లో ప్రతిభ కనబరిచిన 49 మంది యువ క్రీడాకారులకు గాను ఇందులో  24 మంది బాలురు, 25 మంది బాలురు ఈ శిబిరానికి ఎంపికైనట్లు తెలిపారు. వీరిని రానున్న 75వ జూనియర్ నేషనల్ బాస్కెట్ బాల్ ఛాంపియన్షిప్ కోసం సిద్ధం చేస్తున్నట్లువారుతెలిపారు.