22-05-2025 01:21:57 AM
-100 వాహనాలతో పైగా భారీ కాన్వాయిగా సరస్వతీ పుష్కరాలలో పూజలు చేసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజాపూర్ మే 21: సరస్వతి నది పుష్కరాల పుణ్య స్నానాలు చేయడం పూర్వజన్మ సుకృతం అని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. బుధవారం భూపాలపల్లి జిల్లాలోని గోదావరి, ప్రాణహిత,సరస్వతి నది సంఘమా తీర్థం లో పుష్కర స్నానాలు చేశారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఎమ్మెల్యే కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
bఅనంతరం కాలేశ్వర ముక్తేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.వేద పండితులు ఆశీర్వచనాలు అందించి సరస్వతి మాత జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. సరస్వతీ పుష్కరాలలో సామాన్యమైన ప్రజలకు, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేసిన రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు,కొండా సురేఖకు ధన్యవాదాలు తెలిపారు.ఎమ్మెల్యేతోపాటుగా జడ్చర్ల నియోజకవర్గం నుంచి వందలాది మంది కాంగ్రెస్ నేతలు, మీడియా మిత్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు.