calender_icon.png 29 September, 2025 | 6:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్ 2 ఫలితాల్లో ఏసీటీఓగా ఎంపికైన నరేష్

29-09-2025 12:09:15 AM

 నాగారం, సెప్టెంబర్ 28 :  తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన గ్రూప్-2 ఫలితాలలో  మండలంలోని ఫణిగిరి గ్రామానికి చెందిన సంపతి నరేష్ కు 368  మార్కులతో 523 ర్యాంక్ సాధించగా ఏ సిటీవోగా  ఎంపిక అయినట్లు ఆదివారం విలేకరులకు తెలిపారు. అత్యంత నిరుపేద కుటుంబంలో జన్మించిన నరేష్ పదవ తరగతి వరకు ఫణిగిరి ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్ సూర్యాపేట ప్రభుత్వ కళాశాలలో, డిగ్రీ సూర్యాపేట మహర్షి కాలేజీలో పూర్తి చేశారు. చిన్నతనం నుండే చదువుపై ఆసక్తి పెంచుకొని ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని పట్టుదలతో గ్రూప్ 2 ఫలితాల్లో ఏ సిటీవోగా నియమితులయ్యారు. కాగా ఏ సి టి ఓ ఉద్యోగం సాధించిన  నరేష్ కు పలువురు అభినందనలు తెలిపారు.