calender_icon.png 26 September, 2025 | 1:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విదేశాల్లో ఉంటూ మత విద్వేషాలను రెచ్చగొట్టెల పోస్టులు

26-09-2025 12:32:45 AM

ముంబై ఎయిర్‌పోర్టులో ఒకరి అరెస్టు

ఆదిలాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాం తి):  విదేశాలలో ఉంటూ పోలీసులను అవమానపరిచే విధంగా వాట్సాప్ గ్రూప్ పోస్టు లు పెడుతూ, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న షేక్ ఇర్ఫాన్ అనే వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి వెల్లడించారు. గురువారం డిఎస్పీ మీడియాతో మాట్లాడుతూ... షేక్ ఇర్ఫాన్ ను ముంబై విమానాశ్రయంలో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించమన్నారు.

దిలాబాద్ పట్టణంలోని ఖుర్షీద్ నగర్ కు చెందిన షేక్ ఇర్ఫాన్ విదేశాల్లో ఉంటూ ’సిల్సిలా’ అనే వాట్సాప్ గ్రూపు అడ్మిన్ గా వ్యవహరిస్తున్నాడు. ఒక కేసు విషయంలో పోలీసు అధికారులను అవమానిం చేలా పోస్ట్ పెట్టడమే కాకుండా, శాంతి భద్రతలకు భంగం కలిగించేలా విమర్శ లు చేసి ఇరువర్గాల మధ్య గొడవలు జరిగేలా పోస్ట్ పెట్టాడన్నారు.

ఈ మేరకు టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిందని, జిల్లా ఎస్సీ అభిల్ మహాజన్ సిఫార్సుతో ఇమిగ్రే షన్ అధికారులు లుకౌట్ సర్కులర్ జారీ చేశారు. దీంతో టాం జానియా నుంచి ముంబై ఎయిర్ పోర్టుకు వచ్చిన ఇర్ఫాన్ ను ఇమిగ్రేషన్ అధికారులు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నిందితుడి నుండి పాస్ పోర్ట్, 2 ఫోన్లు సీజ్ చేశామన్నారు.