calender_icon.png 26 September, 2025 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీటీవో ఉద్యోగానికి ఎంపికైన చిన్న బూద వాసి

25-09-2025 10:54:25 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చిన్న బూద (రవీంద్ర నగర్) కు చెందిన కొత్తూరు సత్యనారాయణమూర్తి గ్రూపు వన్ ఫలితాల్లో కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (సి టి ఓ) ఉద్యోగానికి ఎంపికయ్యారు. రవీంద్ర నగర్ కు చెందిన కొత్తూరు శ్రీనివాస్ కుమారుడు సత్యనారాయణ మూర్తి పదో తరగతి వరకు బెల్లంపల్లి సెయింట్ మేరీస్, ఇంటర్ ప్రగతి కళాశాల, డిగ్రీ హైదరాబాదులోని ఏవీ కళాశాలలో పూర్తి చేశారు. డిగ్రీ పూర్తయిన తర్వాత గ్రూప్స్ కు ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఇటీవల గ్రూపు వన్ పరీక్షల్లో 280 ర్యాంక్ సాధించి కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ ఉద్యోగానికి అర్హత సాధించారు.