calender_icon.png 29 September, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆస్ట్రేలియాలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు

29-09-2025 12:00:00 AM

హాజరైన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండి, సెప్టెంబర్28(విజయక్రాంతి):తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతి ఉట్టిపడేలా ఆస్ట్రేలియా దేశంలో బతుకమ్మ సంబరాలు వైభవోపేతంగా జరిగాయి. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ క్వీన్స్ ల్యాండ్ ఆధ్వర్యంలో బ్రిస్ బేన్ నగరంలో జరిగిన ఈ వేడుకలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, తెలంగాణ అసెంబ్లీ మీడియా అడ్వయిజరీ కమిటీ చైర్మన్ ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

అక్కడ నివసిస్తున్న తెలంగాణ వాసులే కాకుండా ఇతర ప్రవాసభారతీయులు వేడుకలకు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సంబరాల్లో తెలంగాణ అసోసియేషన్ ఆప్ క్వీన్స్ ల్యాండ్ అధ్యక్షుడు నరేందర్ కుమార్ చొల్లూరి, ఉపధ్యక్షుడు మాధవ రెడ్డి గుర్రం, కార్యదర్శి దయాకర్ బచ్చు, అసోసియేషన్ ప్రతినిధులు ఉమేశ్ వంగపల్లి, సంతోష్ రావు ఏకే, విజయ నల్ల, శ్రీకళా రూపిరెడ్డి, ప్రియాంక కర్క, విజయ్ కోరబోయిన, ప్రేమలత వాసాల, విరించి రెడ్డి ఎక్కంటి, హరిత తన్నీరు, తదితరులుపాల్గొన్నారు.