29-09-2025 12:00:00 AM
మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్
ఘట్ కేసర్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ఉన్న రైతు రుణమాఫీ కాకూడంది, చేయకూడoది కాదు కదా అని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు. రుణమాఫీ కోసం రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో ఘట్ కేసర్ తహసిల్దార్ కార్యాలయం ఎదుట గత 19 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న రైతులు ఆదివారం వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ ఈటెల రాజేందర్ రిలే నిరాహార దీక్షలో ఉన్న రైతులకు నిమ్మరసం ఇచ్చి తాత్కాలికంగా దీక్షలను విరమింపచేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఘట్ కేసర్ సహకార సంఘం రైతులకు రుణమాఫీ జరగకపోవడంతో రైతులు జేఏసీగా ఏర్పడి రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగిందన్నారు. రుణమాఫీ రాష్ట్రమంతట జరిగిన ఉమ్మడి ఘట్ కేసర్ మండల రైతులకు మాత్రం జరగకపోవడం బాధాకరమన్నారు.
దీంతో రైతులు 19 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారని, దీక్ష సందర్భంగా తాను వ్యవసాయ శాఖ మంత్రి, సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగిందని చూద్దాం, చేద్దాం అన్నారని కావున ముఖ్యమైన సద్దుల బతుకమ్మ, దసరా పండుగలు ఉన్నవి కాబట్టి, దీక్షను తాత్కాలికంగా విరమించడం జరుగుతుందన్నారు. గతంలో ఈప్రాంత ఎంపీగా పనిచేసిన రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి వచ్చింది కాబట్టి ఈప్రాంత రైతుల పక్షాన ఆలోచించి తక్షణమే రూ. 8 కోట్ల పైచిలుకు ఉన్న రుణమాఫీ అమలు చేయాలని కోరారు.
రుణమాఫీ జరగనట్లయితే రైతులు చేపట్టే ఉద్యమానికి వచ్చి నిలబడతానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సొసైటీ చైర్మన్ సింగిరెడ్డి రాంరెడ్డి, మాజీ ఎంపీపీలు బండారి శ్రీనివాస్ గౌడ్, ఏనుగు సుదర్శన్ రెడ్డి, రైతు సొసైటీ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి, మాజీ ఎంపిటిసి మేకల నర్సింగరావు, మాజీ కౌన్సిలర్ చందుపట్ల వెంకటరెడ్డి, బిజెపి మున్సిపల్ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి, బొక్క రవీందర్ రెడ్డి, బొక్క విష్ణువర్ధన్ రెడ్డి బొక్క కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.