02-10-2025 01:53:14 AM
హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): అమెరికా మిషిగన్ రాష్ట్రంలోని డెట్రాయిట్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వ హించినట్లు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
డెట్రాయిట్ చాప్టర్ ఆధ్వర్యంలో మూడవ బతుకమ్మ, దసరా వేడుకలకు 1500 మందికిపైగా తెలుగు ప్రజలు హాజరై నట్ల్లు అసోసియేషన్ నేతలు తెలిపారు. ఈ ఉత్సవాల్లో జీటీఏ యూఎస్‌ఏ బోర్డు అధ్యక్షుడు ప్రవీణ్ కేసిరెడ్డి, ట్రస్టీలు కృష్ణ ప్రసాద్ జలిగామ, మహేష్ వేణుగడసుల, మల్లికార్జున పదుకొనే, సంతోష్ కాకులవరం తది తరులు పాల్గొన్నారు.