29-09-2025 10:27:02 PM
చిట్యాల (విజయక్రాంతి): దుర్గామాత మండపంలో ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడి హరికృష్ణ సోమవారం విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులను పంపిణీ చేశారు. కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులతో నార్కట్పల్లి మండలం చౌడంపల్లి గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన గ్రామంలోని చత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 8వ రోజు శ్రీ సరస్వతీ దేవిగా అమ్మవారి దర్శనం ఇవ్వగా దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి అనంతరం విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఎంతో మహిమ కలిగిన శ్రీ కనకదుర్గమ్మ తల్లిని భక్తిశ్రద్ధలతో కొలవాలని, దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరి పైన ఉండాలని, రైతులు సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో పాడిపంటలతో విలసిల్లాలని ఆయన వేడుకున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో కమిటీ సభ్యులు చెరుకుపల్లి వినయ్ కుమార్, గణేష్, విష్ణు, సురేష్,శివకుమార్, విశ్వతేజ, విగ్నేష్, రోహిత్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.